Mpox Outbreak in Africa: ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ కల్లోలం, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలకు పొంచి ఉన్న ముప్పు
ఇందులో 96శాతానికిపైగా కేసులు ఒక్క కాంగోలో మాత్రమే గుర్తించారు. ఇక కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్ మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి.
United Nations, August 15: ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ మహమ్మారి విజృంభిస్తోంది. ఇందులో 96శాతానికిపైగా కేసులు ఒక్క కాంగోలో మాత్రమే గుర్తించారు. ఇక కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్ మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి.
ఆఫ్రికాఖండంలో ఈ వైరస్‌కు వ్యాక్సిన్ పరిమిత సంఖ్యలో ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ వారం ప్రారంభంలో ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంట్రోల్ ప్రకారం.. ఎంపాక్స్‌తో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ వైరస్ ఉధృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపాక్స్‌పై అందరూ ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల్లోనే విస్తరించే ప్రమాదం ఉందన్నారు. కొవిడ్ సోకిన పిల్లల్లో వేగంగా బయటపడుతున్న టైప్-1 మధుమేహ లక్షణాలు, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయలు వెలుగులోకి..
వివిద దేశాల్లో అనేక రకాలుగా ఎంపాక్స్ వ్యాప్తి చెందుతుందన్నారు. అయితే, ఈ ఏడాది 13 దేశాల్లో ఎంపాక్స్ వైరస్ సోకినట్లు ఆఫ్రికా సీడీసీ వెల్లడించింది. మొత్తం కేసులు, మరణాల్లో 96శాతానికిపైగా కాంగోలోనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే కేసులు 160శాతం, మరణాలు 19శాతం ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు 14వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 524 మంది ప్రాణాలు కోల్పోయారు.దాంతో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సహాయం కోసం పిలుపునిచ్చింది.
2022లో ఎంపాక్స్ 70 కంటే ఎక్కువ దేశాలను ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. కాంగో ఎంపాక్స్ రెస్పాన్స్ కమిటీ కోఆర్డినేటర్ క్రిస్ కాసిటా ఒసాకో మాట్లాడుతూ.. నాలుగు మిలియన్ డోసుల ఎంపాక్స్ వ్యాక్సిన్ కావాలని కాంగో అధికారులు కోరారని.. ఇందులో ఎక్కువగా 18 సంవత్సరాలలోపు పిల్లలకు వినియోగించనున్నట్లు తెలిపారు. అమెరికా, జపాన్ దేశాలు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.