Nepal Road Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అదేనా, కొండల ప్రాంతంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 14 మంది మృతి, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న అన్వేషణ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు (యూపీ ఎఫ్‌టీ 7623 (UP FT 7623) యాత్రికులతో వెళ్తూ.. (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్ (Nepal) లోని తానాహున్ జిల్లాలో మార్స్యాంగ్డి నది (Marsyangdi river) లో పడిపోయింది.
Kathmandu, August 23: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు (యూపీ ఎఫ్‌టీ 7623 (UP FT 7623) యాత్రికులతో వెళ్తూ.. (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్ (Nepal) లోని తానాహున్ జిల్లాలో మార్స్యాంగ్డి నది (Marsyangdi river) లో పడిపోయింది. అనంతరం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. అయితే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.వీరంతా భారతీయులే.
బస్సు శుక్రవారం ఉదయం నేపాల్ (Nepal)లోని పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తనహున్ డీఎస్పీ దీప్ కుమార్ రాయ్ వెల్లడించారు. కొండల ప్రాంతంలో అదుపు తప్పి మర్స్యాంగ్డి నదిలో పడిపోయింది. ఈ సమాచారమందుకున్న ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల్లో ఇప్పటివరకు 16 మందిని కాపాడగా.. మరో 14 మంది మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్‌లో నదిలో పడిన బస్సు, 14 మంది మృతి, బస్సులో ఉన్న 40 మంది భారతీయులే..వీడియో
గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు.ఇప్పటివరకు మొత్తం 14 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా 26 మృతదేహాల కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Here's Accident Videos
పోఖారాలోని మజేరి రిసార్ట్‌లో గురువారం భారతీయ ప్రయాణికులు బస చేశారని, శుక్రవారం ఉదయం పోఖారా నుంచి ఖాట్మండుకు బస్సు బయలుదేరిందని అధికారులు తెలిపారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాధవ్ పాడెల్ నేతృత్వంలోని 45 మంది పోలీసుల బృందం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది జూన్‌లోనూ నేపాల్ (Nepal Accident)లో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు.