Netherland Lockdown: లాక్‌డౌన్ బాట పట్టిన యూరప్ దేశాలు, నెదర్లాండ్స్ లో జనవరి 14వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్, ఒమిక్రాన్ విజృంభణతో అలర్టయిన ప్రభుత్వం
జనవరి 14 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఊహించిన దానికంటే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోందని నెదర్లాండ్స్(Omicron) ప్రధాని తెలిపారు.
Netherlands December 19: ఒమిక్రాన్(Omicron) భయాలతో ప్రపంచదేశాలు మరోసారి లాక్‌డౌన్(Lock down) బాట పడుతున్నాయి. ముఖ్యంగా యూరప్(Europe)లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో పలు దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది(Netherlands Announces Lock down). జనవరి 14 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు హేగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే (Dutch Prime Minister Mark Rutte) ప్రకటించారు.
ఊహించిన దానికంటే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోందని నెదర్లాండ్స్(Omicron) ప్రధాని తెలిపారు. అందువల్లనే లాక్‌డౌన్ తప్పనిసరైందన్నారు. కొత్త లాక్‌డౌన్ (Lock down) ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. కఠిన నిబంధనలతో ఈ లాక్‌డౌన్ కొత్త సంవత్సరం జనవరి 14 వరకు అమల్లో ఉంటుంది. ఐదో వేవ్ చేరువ అవుతున్న తరుణంలో లాక్‌డైన్ అనివార్యమైందని రుట్టే తెలిపారు.
సూపర్ మార్కెట్లు, వైద్యపరమైన వృత్తులు, కార్ గ్యారేజీలు వంటి ఇతర ముఖ్యమైన షాపులు తప్ప, మిగతా ఇతర షాపులు, అన్ని విద్యా సంస్థలు, క్యాటరింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్‌లు, మ్యూజియంలు, థియేటర్‌లు, జూపార్కులు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించింది. నెదర్లాండ్స్ లో శుక్ర, శని వారాల్లో దాదాపుగా 14,742 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. క్రిస్మస్ తర్వాత నెదర్లాండ్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్ విధించారు.
ఒమిక్రాన్ కేసులు యూకేతో పాటూ పలు దేశాల్లో భారీగా పెరుగుతుండటంతో...ఇప్పటికే నెదర్లాండ్స్ లో డిసెంబర్ 14న కొన్ని ఆంక్షలను విధించారు. తాజాగా వాటిని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అప్రధాన షాపులకు నైట్‌లాక్‌డౌన్ అంటే సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించారు. అంతేకాకుండా క్రిస్టమస్ సెలవులకు ఒక వారం ముందునుంచే పాఠశాలలకు సెలవులను ప్రకటించాలని ఆదేశించారు. ఐతే ఒమిక్రాన్ అడ్డుకోవాలంటే ఈ ఆంక్షలు సరిపోవని భావించిన డచ్ ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసిన నాలుగు రోజులకే తాజాగా సంపూర్ణ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంది.