Europe Covid-19 Cases: యూకేలో చేయిదాటుతున్న పరిస్థితులు, ఒక్కరోజే 10వేల ఒమిక్రాన్ కేసులు, యూరప్ దేశాల్లో శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి, పలు చోట్ల మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలు
COVID-19 Outbreak in India | File Photo

United Kingdom December 19: ఒమిక్రాన్(Omicron) ధాటికి యూరప్(Europe) కంట్రీస్‌ విలవిల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా యూకేలో భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు(Omicron Cases) రికార్డవుతున్నాయి. శనివారం ఒక్కరోజే అక్కడ పదివేల కేసులు వచ్చాయి. అటు ఫ్రాన్స్(France) లో కూడా ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

యూకేలో గడచిన నాలుగు రోజులుగా కరోనా కేసులు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. శనివారం ఒక్కరోజే 90 వేల418 కోవిడ్ కేసులు(90,418 daily Covid cases) నమోదు కాగా, అందులో పదివేల ఒమిక్రాన్ కేసులున్నాయి. ఇప్పటివరకు ఏడుగురు ఒమిక్రాన్ బాధితులు మరణించారు. ప్రస్తుతం ప్రతి రోజు సగటున దాదాపు 900 మంది రోగులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రతి రోజు మూడువేల మందికి పైగా ఆస్పత్రుల్లో చేరే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్(Lockdown) స్థాయిలో కఠిన అంక్షలను అమలు చేయకపోతే పరిస్థితి చేయిదాటి పోతుందని ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు.

ఇతర యూరప్(Europe) దేశాలు కూడా కరోనా ధాటికి విలవిలలాడుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా యూరప్(Europe) కంట్రీస్‌లో భారీగా నమోదవుతున్నాయి. దీంతో రానున్న నెలల్లో ఇది తీవ్రంగా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. యూరప్(Europe) లో ఒమిక్రాన్(Omicron) మెరుపు వేగంతో వ్యాపిస్తోందని ఫ్రాన్స్‌ ప్రధాని జీన్ కాస్టెక్స్ హెచ్చరించారు. రానున్న నెలల్లో దీని ఉద్ధృతి తీవ్రంగా ఉండనుందన్నారు. ఫ్రాన్స్ లో తాజాగా 58,128 మందికి వైరస్ సోకింది. జర్మనీ(Germany), రిపబ్లిక్‌ ఆఫ్ ఐర్లాండ్(Ireland), నెదర్లాండ్స్(Netherlands) లో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జర్మనీలో శనివారం 50 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫ్రాన్స్‌, నార్వే, డెన్మార్క్ లో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో వాటిని రిస్క్ దేశాలుగా జర్మనీ ప్రకటించింది.

Omicron Variant Symptoms: ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం

ఇక శీతాకాలంతో పాటూ, పండుగ సీజన్‌ కావడంతో అమెరికా ఒమిక్రాన్ కలవరపెడుతోంది. గత జనవరిలో డెల్టా వేరియంట్ అగ్రదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఇప్పుడు ఒమిక్రాన్‌ ఉద్ధృతి చూపిస్తోంది. తాజాగా అక్కడ 1.7లక్షల మందికి కరోనా సోకింది. ఈ సెప్టెంబర్ తర్వాత ఇదే భారీ పెరుగుదల. వ్యాక్సిన్లు తీసుకోని వారికి ఈ శీతకాలం తీవ్రంగా ఉండనుందని అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు. అటు ఆస్ట్రేలియాలోనూ వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.