New Ebola Virus: ఓవైపు కరోనా..మరోవైపు ఎబోలా, కాంగోలో ఎబోలా వైరస్ దెబ్బకు నలుగురు మృతి, 11సార్లు కాంగోలో వ్యాధి విజృంభణ, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

గతంలో వణికించి వెళ్లిన ఎబోలా వైరస్‌ (New Ebola Virus) మళ్లీ పంజా విసురుతోంది. తాజాగా ఆఫ్రికన్‌ దేశమైన కాంగోలో (Democratic Republic of the Congo) మరోమారు ఎబోలా వైరస్‌ బయటపడింది. దేశంలోని వంగాటా ప్రావిన్స్‌లో ఆరు ఎబోలా కేసులు గుర్తించామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో ఆరుగురు మరణించారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.

Ebola (Photo: Wikimedia Commons)

Geneva/Brazzaville/Kinshasa, June 2: కరోనా కల్లోలం (Coronavirus) మరచిపోకముందే ప్రపంచాన్ని మరో వైరస్ గడగడలాడించేందుకు రెడీ అయింది. గతంలో వణికించి వెళ్లిన ఎబోలా వైరస్‌ (New Ebola Virus) మళ్లీ పంజా విసురుతోంది. తాజాగా ఆఫ్రికన్‌ దేశమైన కాంగోలో (Democratic Republic of the Congo) మరోమారు ఎబోలా వైరస్‌ బయటపడింది. దేశంలోని వంగాటా ప్రావిన్స్‌లో ఆరు ఎబోలా కేసులు గుర్తించామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో ఆరుగురు మరణించారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. 24 గంటల్లో 204 మంది మృతి, 5,598కు చేరిన కోవిడ్-19 మరణాలు, దేశంలో 198,706కు పెరిగిన కరోనా కేసులు, 40 వేల మార్కును దాటిన ముంబై

ఈక్వెటార్‌ ప్రాంతంలోని వంగ్తా హెల్త్‌ జోన్‌లో ఎబోలా వైరస్‌ వ్యాధి బయటపడినట్లు కాంగో ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వాంగ్తా ప్రాంతంలో ఆరు ఎబోలా కేసులను గుర్తించామని.. వీరిలో నలుగురు మరణించగా.. ఇద్దరికి వైద్యం చేస్తున్నట్లు కాంగో ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. వీటిలో మూడు కేసులను లాబొరేటరి పరీక్షల ద్వారా విశ్లేషించి ఎబోలాగా నిర్థారించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.

ఈ క్రమంలో ప్రజలు కోవిడ్‌-19 గురించే కాక ఇతర ప్రాణాంతక వైరస్ ల మీద కూడా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓ ఇతర ఆరోగ్య సమస్యలని నిరంతరం పర్యవేక్షిస్తూ దానిపై స్పందిస్తుంటుంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్‌ వెల్లడించారు.

కాగా కాంగోలో 1976లో మొదటి సారి ఎబోలా వైరస్‌ను గుర్తించిన తర్వాత ఇప్పటికి 11సార్లు అక్కడ వ్యాధి విజృంభించింది. ‘ఇది నిజంగా పరీక్షా సమయం. కానీ డబ్ల్యూహెచ్‌ఓ.. ఆఫ్రికా సీడీసీ వంటి ఇతర సంస్థలతో కలిసి అంటువ్యాధులపై పొరాడే విధంగా జాతీయ ఆరోగ్య విధానాన్ని బలపర్చేందుకు కృషి చేస్తుంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ ఆఫ్రికా రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మస్తిడిసో మోతీ వెల్లడించారు. స్థానిక ప్రభుత్వాలకు సాయం చేసేందుకు ఇప్పటికే వైద్య బృందాలను అక్కడకు పంపినట్లు తెలిపారు.

అక్కడ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, డబ్ల్యూహెచ్ ప్రతిస్పందనను పెంచడానికి ఒక బృందాన్ని పంపాలని యోచిస్తోంది. రవాణా మార్గాల ద్వారా పొరుగు దేశాలకు ఈ కొత్త వ్యాప్తి చెందే అవవకాశం ఉన్నందున త్వరగా మేల్కోవాల్సి ఉందన్నారు. 2018 నుంచి ఎంబడకాలో డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తోంది. బృందం నమూనాల సేకరణ, పరీక్షలకు మద్దతు ఇచ్చింది.. నిర్ధారణ కొరకు జాతీయ ప్రయోగశాలకు ఏర్పాటుచేసి, కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తోంది. మండే ఎండలకు బై..బై, కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు, దేశ వ్యాప్తంగా 102శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపిన వాతావారణ శాఖ

ఈక్వేటియర్ ప్రాంతంలో ఎబోలా వైరస్ చివరిసారిగా 2018లో బయటపడిందని హెల్త్ మినిస్టర్ చెబుతున్నారు. ఆ సమయంలో 54 కేసులు నమోదు కాగా 33 మరణాలు సంభవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా తూర్పు కాంగో ప్రాంతంలో ఎబోలా వైరస్ బారిన పడి 2260 మంది మృతి చెందారు. అప్పటికే రెండు వ్యాక్సిన్‌లు వాడుకలోకి వచ్చినప్పటికీ మరణాల సంఖ్యను మాత్రం నిలువరించలేకపోయాయి.

మనిషి నుంచి మరో మనిషికి శారీరక ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని టెడ్రోస్ చెప్పారు. దీని ద్వారా 25శాతం నుంచి 90 శాతం వరకు ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఎబోలా వస్తే దాని ఇంక్యుబేషన్ సమయం 21 రోజులుగా ఉంటుంది. ఈ సమయంలో కేసులు లేకపోతే ఎబోలా నియంత్రణలో ఉంటుందని ప్రకటించడం జరుగుతుంది. కానీ కాంగోలో ఉన్న తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ 42 రోజులకు ఇంక్యుబేషన్ సమయం పొడిగించింది.

ఎబోలా వైరస్ గబ్బిలాల నుంచి సోకుతుందని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కాంగోలో మరిన్ని కొత్త వ్యాధులు పుట్టుకువచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటి వరకు 2014-16వ సంవత్సరాల మధ్య ఎబోలా వైరస్ తీవ్రంగా ఉండేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తుచేసింది. ఆ సమయంలో పశ్చిమ ఆఫ్రికా దేశాలైన లైబేరియా, సియేరా లియోన్ మరియు గినియాలో ఎక్కువగా ఉన్నింది. ఆ సమయంలో 28వేలకు పైగా ఈ వ్యాధి సోకగా 11వేలకు పైగా మృతి చెందారు.

అయితే ఈ వైరస్ మీద ఎన్నో అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. రెండు నెలల క్రితం తూర్పు కాంగో ప్రాంతం ఎబోలా నుంచి విముక్తి పొందిందనే విసయంపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.ఇప్పుడు కొత్తగా మళ్లీ ఎబోలా కేసు బయటపడటంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే బందాకా నగరంలో ఎబోలా ఎలా వచ్చిందో అనే దానిపై క్లారిటీ లేదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. తూర్పు కాంగో నుంచి ఈ నగరం దాదాపు750 మైళ్ల దూరం ఉందని వెల్లడించింది. కాంగోలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయి. మే 31 నాటికి అక్కడ 3195 కేసులు నమోదు కాగా ఇందులో 72 మంది మృత్యువాత పడ్డారు.