New York City Bans Tiktok: టిక్‌టాక్‌పై అగ్రరాజ్యంలో ఆంక్షలు, మా డేటాను చైనాతో పంచుకోలేమంటూ న్యూయార్క్‌ ప్రభుత్వం వెల్లడి, వినియోగదారుల గోప్యను రక్షించేందుకు చర్యలని ప్రకటన

అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్‌టాక్‌ను (Tiktok) నిషేధించారు. చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉన్న టిక్‌టాక్ ను 150 మిలియన్లకు పైగా అమెరికన్లు ఉపయోగిస్తున్నారు.

Representative Image

New York, AUG 17: న్యూయార్క్ సిటీలో వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ను నిషేధించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్‌టాక్‌ను (Tiktok) నిషేధించారు. చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉన్న టిక్‌టాక్ ను 150 మిలియన్లకు పైగా అమెరికన్లు ఉపయోగిస్తున్నారు. చైనా ప్రభుత్వ ప్రభావం గురించిన ఆందోళనలపై అమెరికా దేశవ్యాప్తంగా ఈ యాప్ నిషేధం కోసం యూఎస్ చట్టసభల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. (New York City Bans TikTok) టిక్ టాక్ (TikTok) సాంకేతిక నెట్‌వర్క్‌లకు భద్రతా ముప్పును కలిగిస్తుందని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ పరిపాలన ఒక ప్రకటనలో తెలిపారు. (Government Devices Over Security Concerns) న్యూయార్క్ సిటీ ఏజెన్సీలు యాప్‌ను 30 రోజుల్లోగా తీసివేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు న్యూయార్క్ నగర యాజమాన్యంలోని పరికరాలు, నెట్‌వర్క్‌లలో యాప్ యాక్సెస్‌ను కోల్పోతారు. న్యూయార్క్ రాష్ట్రం ఇప్పటికే జారీ చేసిన మొబైల్ పరికరాల్లో టిక్‌టాక్‌ను నిషేధించింది.

'Made in India' AirPods: హైదరాబాద్ యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ, ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఉత్పత్తి 

యూఎస్ యూజర్ డేటాను చైనీస్ ప్రభుత్వంతో పంచుకోలేమని, టిక్‌టాక్ వినియోగదారుల గోప్యత,భద్రతను రక్షించడానికి గణనీయమైన చర్యలు తీసుకున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ చెప్పారు. టిక్ టాక్ భద్రతా పరమైన ముప్పు కలిగిస్తుందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే, సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్‌తో సహా యూఎస్ భద్రతా అధికారులు చెప్పారు.

24 Lakh Twitter Handles Blocked: గత రెండు నెలల్లో పెద్ద ఎత్తున ట్విట్టర్ ఖాతాలు బ్లాక్‌, ఏకంగా 25 లక్షలకు పైగా అకౌంట్లు బ్లాక్ చేసిన ఎక్స్‌ 

చైనా ప్రభుత్వం మిలియన్ల కొద్దీ పరికరాల్లో సాఫ్ట్‌వేర్‌ను నియంత్రించడానికి టిక్‌టాక్‌ను ఉపయోగించవచ్చని వ్రే మార్చిలో చెప్పారు. 2020లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ కొత్త డౌన్‌లోడ్‌లను నిషేధించాలని ప్రయత్నించారు. అయితే కోర్టు నిషేధం అమలులోకి రాకుండా నిరోధించింది. అమెరికాలోని పలు రాష్ట్రాలు, నగరాలు ప్రభుత్వ పరికరాల్లో టిక్ టాక్ ను పరిమితం చేశాయి. మోంటానా ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా యాప్‌ను నిషేధించే బిల్లును ఆమోదించింది. ఈ నియమం జనవరి 1వతేదీ నుంచి అమలులోకి రానుంది. దాదాపు సగం మంది అమెరికన్ పెద్దలు టిక్‌టాక్‌పై నిషేధానికి మద్దతు ఇస్తున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.