Nigeria Boat Capsize: పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఘోర పడవ ప్రమాదం, 103 మంది మృతి, వందలమంది గల్లంతు, నైజీరియాలో ఘోర విషాదం

ఓ పెళ్లి వేడుక ముగించుకొని తిరిగివస్తున్న వ్యక్తులు ప్రయాణిస్తున్న పడవ సోమవారం తెల్లవారుజామున 3.00 గంటలకు నైగర్‌ నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దాదాపు 103 మంది మృతిచెందారని, గల్లంతైన మిగతావారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

Boat (Representational Image; Photo Credit: Pixabay)

ఉత్తర నైజీరియాలో ఘోర నది ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుక ముగించుకొని తిరిగివస్తున్న వ్యక్తులు ప్రయాణిస్తున్న పడవ సోమవారం తెల్లవారుజామున 3.00 గంటలకు నైగర్‌ నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దాదాపు 103 మంది మృతిచెందారని, గల్లంతైన మిగతావారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

క్వారా రాష్ట్ర పరిధిలో చీకట్లో జరిగిన ఈ ప్రమాదం గురించి తెల్లారేదాకా ఎవరికీ తెలియలేదు. స్థానికంగా తయారైన పడవలను రవాణాకు ఉపయోగించే నైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారుతున్నాయి. పరిమితికి మించిన బరువు, నాణ్యత లేని పడవల కారణంగానే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా 103 మంది ప్రాణాలు కోల్పోయారు.

యూపీ జైలులో గుండెపోటుతో ఖైదీ మృతి, హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరిస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణలు

మరో వంద మందిని సురక్షితంగా రక్షించారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 300 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.