Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్..15 మంది సభ్యులతో ప్రభుత్వ ఏర్పాటు, నేడే బాధ్యతల స్వీకరణ, భారత్‌లోకి చొరబడేందుకు ప్రజల ప్రయత్నం

ఇవాళ దుబాయ్ నుండి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు యూనస్. ఇవాళ సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఉండే అవకాశం ఉంది.

Nobel laureate Muhammad Yunus to take oath as Bangladesh PM Today(AFP)

Bangladesh, Aug 8:  బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ భాద్యతలు స్వీకరించనున్నారు నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త మహమ్మద్ యూనస్. ఇవాళ దుబాయ్ నుండి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు యూనస్. ఇవాళ సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఉండే అవకాశం ఉంది.

ఢాకా చేరుకున్న అనంతరం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌తో భేటీ అవుతారు యూనస్. హింస మన శత్రువు... మరింత మంది శత్రువులను సృష్టించుకోవద్దు ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, దేశాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

రిజర్వేషన్లు తెచ్చిన హింసతో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కొల్పోయారు. హింసతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతుండగా సరిహద్దు దాటి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ సొంతదేశంలోనే తమకు భద్రత లేదని తమను రానివ్వాలని కోరుతుండగా భారత భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయి.  బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు, భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదని తెలిపిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ 

Here's Video:

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో వందలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు బుధవారం భారత్ లోకి చొరబడాలని చూడగా వారిని బీఎస్ఎఫ్ అడ్డుకుని, వెనక్కి పంపించింది.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ దేశంలో ఉండలేమని బంగ్లా ప్రజలు వేడుకుంటుండగా ఈ విషయంలో తాము ఏం చేయలేమని చెబుతున్న జవాన్లు వారిని వెనక్కి పంపించేస్తున్నారు.

రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన విద్యార్థుల ఆగ్రహావేశానికి గురైంది. చివరకు విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారి వందాలది మంచి చనిపోగా ఆ ఆదేశ ప్రధాని షేక్ హసినా చివరకు రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.