Dhaka, August 6: బంగ్లాదేశ్ (Bangladesh)లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం విదితమే.ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చడం, ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశానికి (All Party Meeting) పిలుపునిచ్చింది.ఉదయం 10 గంటలకు అన్ని పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) పార్టీల నేతలకు వివరించారు. నిరసనలతో భగ్గుమంటున్న బంగ్లాదేశ్, అన్ని విమాన సర్వీసులు, రైళ్లను రద్దు చేసిన భారత్, ఎల్ఐసీ ఆఫీసు మూసివేత
ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశంలో హింస చెలరేగిన అనంతరం సుమారు 8 వేల మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగి వచ్చినట్లు చెప్పారు. వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. భారత్ చేరుకున్న హసీనాతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఈ సందర్భంగా జైశంకర్ తెలిపారు. హసీనా భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించుకోవడానికి ప్రభుత్వం కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్ అల్లర్లు, ప్రధాని మోదీ నివాసంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ అత్యవసర భేటీ, వీడియో ఇదిగో..
ఈ అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, రామ్మోహన్ నాయుడుతో పాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో సంక్షోభంపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. ఆ దేశంలోని తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) వివరిస్తున్నారు. ఇక ఈ సమావేశానికి తమను ఆహ్వానించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.