Protesters Call for PM Sheikh Hasina’s Resignation (Photo Credits: X/@isteheeeer)

Dhaka, August 5: బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా (Air India), ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆ దేశానికి విమానాల రాకపోకలను రద్దు చేసాయి. షెడ్యూల్‌ ప్రకారం.. బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన, బంగ్లాదేశ్‌ నుంచి రావాల్సిన సర్వీసులను నిలిపివేశాయి. ఇప్పటికే విమాన టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణికులు.. తమ టికెట్లను రద్దు చేసుకున్నా.. లేదంటే రీషెడ్యూల్‌ చేసుకున్నా.. చార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేపు షెడ్యూల్‌ ప్రకారం భారత్‌-ఢాకా మధ్య రాకపోకలు సాగించాల్సిన అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేశాం. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అందుకు తాము పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం.’ అని ఇండిగో తన ప్రకటనలో పేర్కొన్నది. ఇక బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను సస్పెండ్ చేసినట్లు భారతీయ రైల్వేస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.  వీడియో ఇదిగో, షేక్‌ హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ భేటీ

బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆఫీసును మూసేస్తున్నట్లు ఎల్ఐసీ సోమవారం ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీ వరకూ బంగ్లాదేశ్ లోని తమ ఆఫీసు మూసేస్తున్నట్లు సోమవారం ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్’లో తెలిపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆగస్టు ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ మూడు రోజుల పాటు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.