బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్న షేక్ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, మిలిటరీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు కలిశారు. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగిన హసీనాకు ధోవల్, ఆర్మీ అధికారులు రిసీవ్ చేసుకున్నారు.షేక్ హసీనాకు భారత వైమానిక దళంతోపాటు ఇతర భద్రతా బలగాలు రక్షణ కల్పించనున్నాయి. వీడియో ఇదిగో, భారత్ చేరుకున్న షేక్ హసీనా, లండన్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వార్తలు, భారత్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం
ప్రస్తుతం ఆమెకు సురక్షితమైన ప్రాంతంలో ఆశ్రయం కల్పించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. హిండన్ ఎయిర్‌బేస్‌లో అజిత్ ధోవల్, మిలిటరీ అధికారులతో హసీనా మాట్లాడారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి, హసీనా భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.ఇక్కడి నుంచి ఆమె లండన్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దాదాపు 300 మంది మృతిచెందారు.
Here's Video
Convoy of NSA Ajit Doval leaving Hindon Airport earlier today after meeting with former Bangladesh PM Hasina https://t.co/EuC8QVsDSk pic.twitter.com/BR3NccXBC2
— Sidhant Sibal (@sidhant) August 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)