బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత్‌కు చేరుకున్నారు. ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులకు ఆమె స్వాగతం పలికారు. అయితే, ఆమె భారత్‌ నుంచి లండన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరో వైపు బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బీఎస్‌ఎఫ్‌ సోమవారం భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో హై అలెర్ట్‌ ప్రకటించింది. బంగ్లాదేశ్‌‌లో ఎందుకీ ఆందోళనలు? విద్యార్థులు చేపట్టిన ఉద్యమం రాజకీయ నిరసనగా ఎందుకు మారింది, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానంపై ఎవరేమన్నారు ?

షేక్ హసీనా ప్రయాణిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన సీ-130 విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే భారత వైమానిక దళం యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. కొద్దిసేపు సీ-130 విమానాన్ని భారత ఫైటర్స్ జెట్లు అనుసరించాయి. ఈ సీ-130 విమానంలో షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన, సైన్యం ముందే సిద్ధమైనట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.బంగ్లాదేశ్‌లోని హింసాత్మక ఘటనల దృష్ట్యా ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)