పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనలు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. నిరసనలతో భగ్గుమంటున్న బంగ్లాదేశ్, అన్ని విమాన సర్వీసులు, రైళ్లను రద్దు చేసిన భారత్, ఎల్ఐసీ ఆఫీసు మూసివేత
కాగా బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం అత్యవసరం భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఈ భేటీలో సమీక్షించనున్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అజిత్ ధోవల్ పాల్గొన్నారు.
Here's Video
CCS meeting is currently underway at the PM's residence, discussing the political crisis in Bangladesh.
#BangladeshCrisis pic.twitter.com/QEUSH1ef0b
— All India Radio News (@airnewsalerts) August 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)