Pakistan: గోధుమ పిండి కిలో 320 రూపాయలు, దాయాది దేశంలో ఒక్కసారిగా పెరిగిన ధర, ద్రవ్యోల్భణం పెరగడంతో పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు

దాయాది దేశంలో ద్రవ్యోల్భణం (Inflation) పెరగడంతో దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గోధుమ పిండి ధర అయితే భారీగా పెరిగింది. అక్కడ గోధుమ పిండికి డిమాండ్‌ అధికంగా ఉండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Pakistan Flour Crisis (Photo-Credit: AP/PTI Photo)

Karachi, July 17: పాకిస్థాన్‌ (Pakistan) తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకుంది. దాయాది దేశంలో ద్రవ్యోల్భణం (Inflation) పెరగడంతో దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గోధుమ పిండి ధర అయితే భారీగా పెరిగింది. అక్కడ గోధుమ పిండికి డిమాండ్‌ అధికంగా ఉండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే కిలో పిండి కొనాలంటే అక్కడి ప్రజలు రూ.320 వెచ్చించాల్సిందే. దీంతో ప్రపంచంలోనే గోధుమ పిండి ధరలు అత్యధికంగా పాక్‌లోనే ఉన్నాయని పాకిస్థాన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (PBS) తెలిపింది.

గోధుమ పిండి కోసం విలవిలలాడుతున్న పాకిస్తాన్, దాయాది దేశంలో ముదిరిన ఆర్థిక సంక్షోభం, ప్రమాదకర స్థాయిలో పడిపోతున్న విదేశీ మారక నిల్వలు

దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో (Karachi) రూ.200 అధికమైన 20 కిలోల గోధుమ పిండి బస్తా ధర రూ.3200కు చేరింది. ఇక హైదరాబాద్‌లో రూ.3040, ఇస్లామాబాద్‌, రావల్పిండి, సియాల్‌కోట్‌, ఖుజ్దర్‌లో 20 కిలోల బస్తాపై రూ.106, రూ.133, రూ.200, రూ.300 చొప్పున పెరిగాయి. వాటితోపాటు బహవల్పూర్‌, ముల్తాన్‌, సుక్కూర్‌, క్వెట్టా పట్టణాల్లో గోధుమపిండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో చక్కెర ధరల రూ.160కి పెరిగింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif