Pakistan Airstrike on Iran: ఇరాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు, ఉగ్ర‌వాదుల స్థావ‌రాలే ల‌క్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్

ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఎయిర్ స్ట్రైక్స్ (airstrikes) నిర్వ‌హించింది

Pakistan airstrikes on iran (PIC@ X)

Lahore, JAN 18: ఇరాన్ పై వైమానిక దాడుల‌కు పాల్ప‌డింది పాకిస్థాన్ (Pakistan Airstrike on Iran). ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఎయిర్ స్ట్రైక్స్ (airstrikes) నిర్వ‌హించింది. సిస్ట‌న్ బెలూచిస్తాన్ ప్రావిన్స్ లోని 7 ప్ర‌దేశాల్లో ఆక‌స్మిక దాడులు చేసింది పాకిస్థాన్. ఈ ఘ‌ట‌న‌లో భారీగా ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది.

 

ఎయిర్ స్ట్రైక్స్ చేసిన ప్రాంతంలో భారీగా పొగ అలుముకుంది. బ‌లూచ్ మిలిటెంట్ గ్రూప్ ను టార్గెట్ చేసి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. స‌ర్వాన్ న‌గ‌రానికి 20 మైళ్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దాడి జ‌రిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగుతున్న‌ట్లు అంత‌ర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి.



సంబంధిత వార్తలు