Papua PM Touches Modi Feet : మోదీకి ఎదురెళ్లి మరీ పాదాభివందనం చేసిన గినియా దేశం ప్రధాని, నరేంద్రమోదీ కోసం రూల్స్ కూడా మార్చిన పాపువా న్యూగినియా దేశం
అయితే ఆ సందర్భంలోనే ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఒక్కసారిగా మోదీకి పాదాభివందనం చేశారు జేమ్స్. మొదట ఇరు నేతలు కౌగిలించుకున్నారు. అనంతరం మోదీకి పాదాభివందనం చేశారు పాపువా న్యూ గినియా దేశ ప్రధాని.
Port Moresby, May 21: పాపువా న్యూ గినియా (Papua New Guinea) దేశంలో జరిగే ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కూపరేషన్ (FIPIC) సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ఆదివారం ఆ దేశం వెళ్లారు. ప్రధానమంత్రి మోదీని ఎయిర్పోర్టుకు వెళ్లి మరీ ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరపే (James Marape) స్వాగతం పలికారు. అయితే ఆ సందర్భంలోనే ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఒక్కసారిగా మోదీకి పాదాభివందనం చేశారు జేమ్స్. మొదట ఇరు నేతలు కౌగిలించుకున్నారు. అనంతరం మోదీకి పాదాభివందనం చేశారు పాపువా న్యూ గినియా దేశ ప్రధాని. వాస్తవానికి సూర్యాస్తమయం తర్వాత తమ దేశాన్ని సందర్శించే ఏ నాయకుడికి పాపువా న్యూ గినియా సాధారణంగా ఉత్సవంగా స్వాగతం పలకదు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చారు.
ఇక పాపువా న్యూ గినియా దేశాన్ని సందర్శించిన భారత మొదటి అధినేత మోదీయే. ఈరోజు వరకు జీ-7 సమ్మిట్ కోసం జపాన్‌లో ఉన్న మోదీ.. అది ముగించుకుని పాపువా న్యూ గినియాకు వెళ్లారు. ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోదీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో కూడా భేటీ కానున్నారు. “ఈ ముఖ్యమైన శిఖరాగ్ర సమావేశానికి (ఎఫ్‌ఐపిఐసి) హాజరు కావడానికి 14 పసిఫిక్ ద్వీప దేశాలు (పిఐసి) ఆహ్వానాన్ని అంగీకరించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ఆదివారం ఉదయం మోదీ ప్రకటన చేశారు.
ఎఫ్‌ఐపిఐసి సమ్మిట్‌లో 14 దేశాల నాయకులు పాల్గొంటారు. 2014లో ప్రధాని మోదీ ఫిజీ పర్యటన సందర్భంగా దీన్ని ప్రారంభించారు. పసిఫిక్ దీవుల సహకారంలో కుక్ దీవులు, ఫిజీ, కిరిబాటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావు, పాపువా న్యూ గినియా, సమోవా, సోలమన్ దీవులు, టోంగా, తువాలు, వనాటు ఉన్నాయి.