Peru: పెరూ దేశానికి అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ, రాజధాని లిమాలో ప్రమాణ స్వీకారం చేసిన దినా బొలార్టే, అభిశంసన ద్వారా అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్ అరెస్ట్
ఆమె రాజధాని లిమాలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ద్వారా తొలగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
పెరూ దేశానికి తొలిసారిగా మహిళ అయిన దినా బొలార్టే దేశాధ్యక్షురాలయ్యారు. ఆమె రాజధాని లిమాలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ద్వారా తొలగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అభిశంసన తర్వాత పెడ్రోను అరెస్టు చేశారు. మెక్సికో ఎంబసీకి వెళ్తున్న సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.జూలై 2026 వరకు తానే అధికారంలో ఉండనున్నట్లు ఆమె తెలిపారు. కొంత సమయం ఇస్తే దేశాన్ని కాపాడుతానని ఆమె తెలిపారు.
ఉత్తర కొరియాలో దారుణం, పక్కదేశం సినిమాలు చూశారని ఇద్దరి విద్యార్థులను ప్రజల మధ్యనే కాల్చి చంపిన కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం
కాగా టీవీలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన దేశంలో అత్యవసర స్థితిని ప్రకటించారు. కానీ పెడ్రో తీరును ఆగ్రహించిన ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పారు. సుమారు 101 మంది నేతలు ఆయనపై అభిశంసన ప్రకటించాయి. ఆ తర్వాత పెడ్రోను పోలీసులు అరెస్టు చేశారు. పెడ్రో భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.