BRICS Summit 2023: బ్రిక్స్‌లోకి మరో ఆరు శాశ్వత సభ్య దేశాలు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమలులోకి, ఆ ఆరు దేశాలు ఇవే..

ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్‌’ (BRICS) మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్‌’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాలని ఈ గ్రూప్‌ నిర్ణయించింది.

BRICS Summit 2023 (Image Credits: X/ANI)

New Delhi, August 24: జొహెన్నస్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న బ్రిక్స్‌-2023 సదస్సుకు ప్రధాని మోదీ హాజరయిన సంగతి విదితమే. ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్‌’ (BRICS) మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్‌’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాలని ఈ గ్రూప్‌ నిర్ణయించింది.

బ్రిక్స్‌ గ్రూప్‌లోకి ఆరు దేశాలను శాశ్వత సభ్యులుగా ఆహ్వానిస్తున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తెలిపారు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు ‘బ్రిక్స్‌’ గ్రూప్‌లో చేరుతాయని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఆరు దేశాల సభ్యత్వం అమలులోకి వస్తుందని అన్నారు.

ప్రపంచ వేదికపై భారత్‌కు షాక్, డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వం రద్దు చేసిన యూడబ్ల్యూడబ్ల్యూ, ఎన్నికల నిర్వహణ ఆలస్యమే కారణం

‘బ్రిక్స్‌’ సమ్మిట్‌లో పాల్గొన్న భారత ప్రధాని మోదీ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఆరు దేశాలను ఈ గ్రూప్‌లోకి ఆహ్వానించడాన్ని స్వాగతించారు. ఈ ఆరు దేశాలతో భారత్‌కు చాలా సన్నిహిత, చారిత్రక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కొత్త శకం, సహకారం, శ్రేయస్సు కోసం తామంతా కలిసి పని చేస్తామని అన్నారు. ‘బ్రిక్స్‌’ సమ్మిట్‌లో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా గ్రూప్‌ విస్తరణకు మద్దతిచ్చారు.మరోవైపు ‘బ్రిక్స్‌’ సభ్యులుగా చేరేందుకు 20కుపైగా దేశాలు ఆసక్తి చూపాయి. శాశ్వత సభ్యత్వం కోసం దరఖాస్తు కూడా చేశాయి. అయితే వీటిలో ఆరు దేశాలను ఎంపిక చేశారు.

బ్రిక్స్‌-2023 సదస్సులో ఇవాళ ప్రధానకర్షణగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నిలిచారు. కరచలనంతో పాటు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతున్నాయి. వాస్తవానికి బ్రిక్స్‌ వేదికగా అయినా ఇద్దరూ సమావేశం అవుతారనే అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇటు భారత, అటు చైనా విదేశీ వ్యవహారాల శాఖలు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో.. ఈ ఇద్దరి మధ్య బ్రిక్స్‌ వేదికగా ప్రత్యేక భేటీ జరగనప్పటికీ ముచ్చట్లు మాత్రం సాగాయి. బ్రిక్స్‌కు హాజరైన నేతలు వేదికపైకి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో.. జింగ్‌పిన్‌తో మోదీ ఏదో ముచ్చటించారు. ఆపై వేదికపై ఇద్దరూ కరచలనం చేసుకున్నారు కూడా. ఆ సమయంలో అందరి చూపు ఆ ఇద్దరివైపే ఉండిపోయింది.

ఇరుదేశాల వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితుల తర్వాత ఈ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యింది లేదు. కాకుంటే.. గత ఏడాది జీ20 సదస్సులో ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోలు ఒకటి బాగా వైరల్‌ అయ్యింది. అది కొద్దిసేపే అయినా ఏం మాట్లాడుకున్నారనే చర్చ నడిచింది. ఇక బ్రిక్స్‌లో దక్షిణాఫ్రికా, భారత​, చైనా, రష్యా, బ్రెజిల్‌ సభ్య దేశాలు కాగా.. ఉక్రెయిన్‌ యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వారెంట్‌జారీ చేయడంతో రష్యా తరపున వ్లాదిమిర్‌ పుతిన్‌ కాకుండా సెర్గీ లావ్రోవ్‌ హాజరయ్యారు.