PM Modi: ప్రపంచాధినేతల్లో నరేంద్ర మోదీ నంబర్ వన్, తాజా సర్వేలో 71 శాతం మంది ఆమోదం, మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో ఆసక్తికర విషయాలు
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లోభారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో (PM Modi Tops List of Most Popular World Leaders) నిలిచారు. ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది.
New Delhi, Jan 21: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లోభారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో (PM Modi Tops List of Most Popular World Leaders) నిలిచారు. ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. 71 శాతం మంది ( 71 Pc Rating) సానుకూలంగానూ, 21 శాతం మంది వ్యతిరేకంగానూ స్పందించడంతో ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ 50 ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు తెలిపింది. ప్రపంచ నేతలకు కల ప్రజాదరణను మోర్నింగ్ కన్సల్ట్ (Morning Consult Political Intelligence) పరిశీలిస్తుంది. ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రదాని మోదీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కోవిడ్ రెండో ప్రభంజనం సమయంలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి. ప్రస్తుతం మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని వివిధ దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది.
బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రజాదరణ దారుణంగా తగ్గిపోయింది. ఆయన అప్రూవల్ రేటింగ్ మైనస్ 43 వద్ద ఉంది. ఆయనను 69 శాతం మంది డిజప్రూవ్ చేశారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన ట్రుడు, బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ-ఇన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్‌లకు నెట్ నెగెటివ్ అప్రూవల్ రేటింగ్స్ వచ్చాయి. ఏడు రోజులపాటు వయోజనులైన ప్రజల మూవింగ్ యావరేజ్‌ను పరిశీలించి ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ ప్రకటించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి సంఖ్య వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉన్నట్లు తెలిపింది.
ప్రపంచ నేతల గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ :
నరేంద్ర మోదీ (భారత్) : 71 శాతం
ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ (మెక్సికో) : 66 శాతం
మారియో డ్రాఘి (ఇటలీ) : 60 శాతం
పుమియో కిషిదా ( జపాన్) : 48 శాతం
ఒలప్ స్కాల్జ్ (జర్మనీ) : 444 శాతం
జో బైడెన్ (అమెరికా) : 43 శాతం
జస్టిన్ ట్రుడు (కెనడా) : 43 శాతం
స్కాట్ మారిసన్ (ఆస్ట్రేలియా) : 41 శాతం
పెడ్రో సాంచెజ్ (స్పెయిన్) : 40 శాతం
మూన్ జేయి-ఇన్ (సౌత్ కొరియా) : 38 శాతం
జైర్ బోల్సోనారో ( బ్రెజిల్) : 37 శాతం
ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (ఫ్రాన్స్ ) : 34 శాతం
బోరిస్ జాన్సన్ (బ్రిటన్) : 26 శాతం
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)