Premarital Sex: ఇకపై పెళ్లికి ముందు శృంగారం చేస్తే జైలుకే, సహజీవనంపై కూడా నిషేదం విధించే యోచనలో ఆ దేశ ప్రభుత్వం, ఏడాది జైలుశిక్షతో పాటూ భారీగా జరిమానా విధించే దిశగా చట్టం చేసేందుకు ఏర్పాట్లు

భార్య లేదా భర్త లేనివారితోనూ ఎవరైనా శృంగారంలో పాల్గొంటే, వారిని వ్యభిచారం కింద శిక్షిస్తాం. కేటగిరి-2 కింద గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఉంటుంది’ అని ముసాయిదాలో పేర్కొంది.

Premarital Sex (Photo Credits: Unsplash)

Jakarta, DEC 02: పెళ్లికి ముందు శృంగారం విషయంలో ఇండోనేషియా (Indonesia) ప్రభుత్వం సంచనల నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పెళ్లికి ముందు శృంగారంతో పాటూ, సహజీవనం (Living Relation), అసహజ శృంగారం (heterosexual couples) వంటి పనులకు పాల్పడితే కఠిన శిక్షలు వేయాలని నిర్ణయించింది. దీంతో పాటూ ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు లేదా సంస్థలను కించపరిచే వ్యాఖ్యలపై కూడా ఆంక్షలను విధించనుంది. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే ఏడాదిపాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించనుంది. ఇందుకోసం నూతన చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమైనట్లు ఇండోనేసియా (Indonesia) ప్రభుత్వం వెల్లడించింది. వీటికి సంబంధించిన క్రిమినల్‌ కోడ్‌ ముసాయిదా (RKUHP)ను ఈ నెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై దేశ ఉప న్యాయశాఖ మంత్రి, మానవ హక్కుల సంఘంతో ఇటీవల జరిగిన భేటీ అనంతరం తాజా విషయం వెల్లడైంది.

Kobe Cannibal: యువతిని చంపి శవంపై అత్యాచారం, ఆపై శవాన్ని వండుకొని తిన్న వ్యక్తి, 40 ఏళ్లుగా ఎలాంటి శిక్ష లేకుండా బయటతిరిగిన వ్యక్తి, వృద్ద్యాప్య సమస్యలతో మృతిచెందిన జపాన్ నరమాంస భక్షకుడు 

‘పెళ్లికి ముందు శృంగారం (Premarital Sex), సహజీవనం చేయడం నిషేధం. భార్య లేదా భర్త లేనివారితోనూ ఎవరైనా శృంగారంలో పాల్గొంటే, వారిని వ్యభిచారం కింద శిక్షిస్తాం. కేటగిరి-2 కింద గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఉంటుంది’ అని ముసాయిదాలో పేర్కొంది. ఇండోనేసియా పౌరులతోపాటు విదేశీయులకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇదే విషయంపై మాట్లాడిన దేశ ఉప న్యాయశాఖమంత్రి ఎడ్వార్డ్‌ ఒమర్‌ షరీఫ్‌ హియారిజ్‌.. ఇండోనేసియా విలువలకు తగినట్లుగా కొత్త చట్టం ఉండటం తమకెంతో గర్వకారణమని అన్నారు.

Afghanistan: తాలిబన్ రాజ్యంలో మరో దారుణం, వారికి ఆహారం కాకుండా ఉండేందుకు చిన్న వయసులోనే బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు 

ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేసియా.. మహిళలు, మతపరమైన మైనారిటీలు, స్వలింగ సంపర్కులపై ఎన్నో ఆంక్షలు విధిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ.. స్థానిక విలువలకు అనుగుణంగా నేర నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఈ దేశం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా రూపొందించిన నూతన ముసాయిదా చట్టం.. 2019లోనే ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, దీనిపై జాతీయస్థాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కొత్త చట్టం.. పౌర స్వేచ్ఛను అణచివేసేలా ఉందని వేల మంది ఆందోళనలకు దిగారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం.. ప్రజలతో సంప్రదింపులు జరిపి, కొన్ని మార్పులతో ఈ నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.