Recent Geopolitical Developments by Dr Jaishankar: యూఏఈతో మన బంధం ఎంతో దృఢమైంది.. ఐజీఎఫ్ యూఏఈ గ్లోబల్ ఫోరంలో జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రకృతి పరిరక్షణకు, గ్లోబల్ వార్మింగ్ కట్టడికి యూఏఈతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
Abu Dhabi, Dec 13: ప్రపంచ వాతావరణ పరిరక్షణలో భాగంగా యూఏఈ (UAE) వేదికగా నిర్వహించిన ఐజీఎఫ్ యూఏఈ (IGF UAE) (గ్లోబల్ ఫోరం)-2022లో పాల్గొన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ (JaiShankar) మాట్లాడారు. ప్రకృతి పరిరక్షణకు, గ్లోబల్ వార్మింగ్ (Global Warming) కట్టడికి యూఏఈతో కలిసి పనిచేస్తామని తెలిపారు. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయన కొన్ని అంశాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రపంచీకరణ.. ప్రపంచ దేశాలపై దాని ప్రభావం గురించి వివరించారు. వనరులు, సేవలు, అభివృద్ధి కేవలం ఏ ఒక్క దేశానికి పరిమితం కాకుండా, ప్రపంచంలోని అన్ని దేశాలకు వాటిని సమతూకంగా విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
భారత్ తో యూఏఈకి బలమైన బంధం ఉన్నదని, ఆ దేశంతో భారత్ కు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాణిజ్య సంబంధాలు ఉన్నట్టు గుర్తుచేశారు. భారత్ నుంచి అత్యంత ఎక్కువ మంది భారతీయులు ఈ దేశానికే ఉపాధికి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ యూఏఈతో భారత్ బంధం ఇలాగే కొనసాగుతుందని ఆకాంక్షించారు.