Credits: Video Grab

Guntur, Dec 13: గుంటూరు (Guntur) జిల్లాకు చెందిన యువతి.. హైదరాబాద్‌లో (Hyderabad) నర్సింగ్‌ (Nursing) చేస్తోంది. పేరు యామిని. తన వ్యక్తిగత అవసరాల కోసం తండ్రి ఏటీఎం (ATM) కార్డులో నుంచి రూ.2 లక్షలు వాడుకుంది. వీటిని తిరిగి చెల్లించడానికి కిడ్నీ (Kidney) అమ్మడానికి సిద్ధమైంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో (Online) కనిపించిన నంబర్‌కు కాల్‌ చేసింది. యువతి అవసరాన్ని గుర్తించిన సైబర్‌ నేరగాళ్లు (Cyber criminals).. రూ.3 కోట్లు ఇస్తామంటూ ఎర వేశారు. ట్యాక్స్‌ ల పేరిట పలు దఫాలుగా రూ.16 లక్షలు కొల్లగొట్టారు. డాక్టర్ ప్రవీణ్ రాజ్ పేరిట పరిచయం చేసుకున్న మోసగాడు, ఆమెను ఢిల్లీ రావాలని సూచించాడు.

800 మార్కులకు 5,360 మార్కులు.. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో వింత

ఆమె ఖాతాలో రూ.10 వేల నగదు కూడా జమ చేశారు. అయితే, ఢిల్లీ వెళ్లిన యామినికి అక్కడెవరూ కనిపించకపోవడంతో తాను మోసపోయానని గుర్తించింది. ఈ విషయం తండ్రికి తెలియజేసింది. తండ్రితో కలిసి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఈ సైబర్ మోసంపై స్పందిస్తూ, ఆన్ లైన్ లో కనిపించే అన్ వెరిఫైడ్ లింకులపై క్లిక్ చేయరాదని స్పష్టం చేశారు.