Richard Rick Slayman: పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్య‌క్తి మృతి, రెండు నెల‌ల పాటూ ఆరోగ్యంగానే ఉన్నాడు..మాకేం సంబంధం లేదంటున్న ఆస్ప‌త్రి సిబ్బంది

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జన్యుపరంగా పంది కిడ్నీ మార్పిడి (Pig Kidney Transplant) ద్వారా చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ (Richard Slayman) తాజాగా మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయిన రిచర్డ్‌కు ఈ ఏడాది మార్చిలో శస్త్రచికిత్స ద్వారా పంది కిడ్నీని అమర్చారు.

Pig Kidney Transplant (Photo Credit- Youtube/@6abcphiladelphia)

Boston, May 12: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జన్యుపరంగా పంది కిడ్నీ మార్పిడి (Pig Kidney Transplant) ద్వారా చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ (Richard Slayman) తాజాగా మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయిన రిచర్డ్‌కు ఈ ఏడాది మార్చిలో శస్త్రచికిత్స ద్వారా పంది కిడ్నీని అమర్చారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌ (Massachusetts General Hospital)లో దాదాపు నాలుగు గంటలపాటు ఆపరేషన్‌ చేసిన వైద్యులు విజయవంతంగా పంది కిడ్నీని అమర్చారు. ఆ తర్వాత రెండు వారాలకు ఆయన్ని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

Bronx Sex Assault: షాకింగ్ వీడియో ఇదిగో, మహిళను బెల్ట్‌తో కారు పక్కకు లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం, స్పృహ లేకున్నా కోరిక తీర్చుకున్న కామాంధుడు 

కిడ్నీ అమర్చిన రెండు నెలలకు తాజాగా అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడి మరణానికి గల కారణాలు మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. మరోవైపు రిచర్డ్‌ మృతిపట్ల మసాచుసెట్స్ ఆసుపత్రి వైద్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పంది కిడ్నీ అమర్చడం వల్లే అతడు మరణించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని వైద్యులు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement