Putin Praises PM Modi Leadership: భారత్‌తో పెట్టుకుంటే భవిష్యత్ ఉండదు, పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక, ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం (Putin Praise PM Modi Leadership) కురిపించారు.‘‘ప్రపంచంలో అత్యధికంగా ఆర్థికాభివృద్ధి, వృద్ధిరేటులో భారత్ ఒకటిగా ఉంది, అది కూడా ప్రస్తుత ప్రధాని నాయకత్వ లక్షణాలే కారణమని అన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 26: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం (Putin Praise PM Modi Leadership) కురిపించారు.‘‘ప్రపంచంలో అత్యధికంగా ఆర్థికాభివృద్ధి, వృద్ధిరేటులో భారత్ ఒకటిగా ఉంది, అది కూడా ప్రస్తుత ప్రధాని నాయకత్వ లక్షణాలే కారణమని అన్నారు. ఆయన నాయకత్వంలోనే భారతదేశం ఇంతటి వేగం పుంజుకుందని (Russia praises India's independent foreign policy) తెలిపారు.
రష్యా విద్యార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాలినిన్‌గ్రాడ్‌లో యూనివర్సిటీ విద్యార్థులతో సంభాషించిన పుతిన్, ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించడం అంత సులువుకాని ‘స్వతంత్ర’ విదేశాంగ విధానాన్ని ( India's independent foreign policy) అనుసరిస్తున్నందుకు భారత్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌పై రష్యా ఆధారపడవచ్చని కూడా పుతిన్ అన్నారు.ప్రపంచ వేదికలపై భారత్.. రష్యాపై ఎప్పుడూ వ్యతిరేకమైన వైఖరితో నిర్ణయాలు తీసుకోలేదు. రష్యాపై ఇప్పటివరకు ద్వంద వైఖరిని భారత్ ప్రదర్శించలేదు. అందుకే భారత్, ఆ దేశ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది’ అని పుతిన్ అభిప్రాయపడ్డారు.
'మేక్ ఇన్ ఇండియా' చొరవను పుతిన్ ప్రశంసించారు మరియు ఇది ప్రధాని మోడీ ఆధ్వర్యంలో (PM Narendra Modi’s Leadership) భారీ తరంగాలను సృష్టిస్తోందని అన్నారు. భారతదేశానికి గొప్ప సంస్కృతి ఉందని, దానిని ఆసక్తికరంగా, వైవిధ్యంగా, రంగులమయంగా అభివర్ణిస్తూ రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ అమలు పరుస్తున్న విదేశి విధానాలు అసాధారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది, ఇది ఆధునిక ప్రపంచంలో అంత సులభం కాదు. కానీ ఒకటిన్నర బిలియన్ల జనాభా కలిగిన భారతదేశానికి దీనిపై హక్కు ఉంది" అని విద్యార్థులతో జరిగిన సమావేశంలో పుతిన్‌ను ఉటంకిస్తూ రష్యా వార్తా వెబ్‌సైట్ స్పుత్నిక్ పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమం రష్యాతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా చర్చకు వస్తోందన్నారు. భారత్‌కు అంత్యంత ఎక్కువ విదేశి పెట్టుబడులు రష్యా నుంచి లభిస్తున్నాయని తెలిపారు. తమ దేశంలోని పలు కంపెనీలు భారత్‌లో ఇప్పటికే సుమారు సుమారు 23 బిలియన్ అమెరికా డాలర్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు.ఓ చమురు శుద్ధి కర్మాగారం కొనుగోలు, గ్యాస్ స్టేషన్లు, పోర్టులు తదితర రంగాల్లో పెట్టుబడులను ఆయన ప్రస్తావించారు. ‘భారత్‌కు గొప్ప సంస్కృతి ఉంది. జాతీయ టీవీ ఛానెళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటి. ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదని తెలిపారు.
ఈ సందర్భంగా భారత్‌తో ఆటలొద్దని పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరిక జారీ చేశారు. "బయటి నుండి దాని రాజకీయాలపై ప్రభావం చూపడానికి సంబంధించిన భారతదేశంతో ఆటలు ఆడటం వల్ల భవిష్యత్తు లేదు" అని రష్యా నాయకుడు అన్నారు.