Apple VS Russian Man: ఐఫోన్ నన్ను ‘గే’ గా మార్చింది, ఆపిల్ రూ.10 లక్షల నష్ట పరిహరం చెల్లించాల్సిందే, కోర్టును ఆశ్రయించిన రష్యన్, ఇంకా అధికారికంగా స్పందించని ఆపిల్
ప్రపంచంలోనే మొదటి కేసు అని కూడా చెప్పవచ్చేమో.. టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీకి నిజంగా ఇది చేదువార్తే అని చెప్పాలి. ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ లోని ఓ యాప్ ఓ యువకుడిని గేగా మార్చింది. దీంతో అతను ఆపిల్ పే కేసు వేశాడు.
October 5: ఇది చాలా విచిత్రమైన కేసు. ప్రపంచంలోనే మొదటి కేసు అని కూడా చెప్పవచ్చేమో.. టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీకి నిజంగా ఇది చేదువార్తే అని చెప్పాలి. ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ లోని ఓ యాప్ ఓ యువకుడిని గేగా మార్చింది. దీంతో అతను ఆపిల్ పే కేసు వేశాడు. ఆపిల్ కంపెనీ ఐఫోన్ లోని ఒక యాప్ తనను స్వలింగ సంపర్కుడిగా మార్చిందని ఆరోపిస్తూ ఓ రష్యన్ యువకుడు ఈ కేసు పెట్టాడు.
దీని వల్ల నేను మానసికంగా , శారీరకంగా, నైతికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నానని, దీనికి ఆపిల్ కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. మొత్తం పది లక్షల రూబుళ్లు (10.97 లక్షల రూపాయలు) పరిహారంగా చెల్లించాలని రష్యన్ యువకుడు డిమాండ్ చేస్తున్నాడు. ఆపిల్‌పై రష్యన్ సెప్టెంబరు 20న కేసు వేయగా అది ఈ నెల 17న కోర్టులో విచారణకు రానుంది. దీనిపై ఆపిల్ కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఐఫోన్లో యాప్ ద్వారా తాను బిట్‌కాయిన్‌కు ఆర్డర్ ఇస్తే దానికి బదులుగా గేకాయిన్' అనే క్రిప్టో కరెన్సీ తనకు వచ్చిందని అతను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ గే కాయిన్ క్రిప్టో కరెన్సీపై "ప్రయత్నించకుండా అభిప్రాయానికి రావొద్దు" అనే నోట్ ఉండటంతో నేను అలాగే ప్రయత్నించానని ఆరోపించారు. ప్రయత్నించకుండా అభిప్రాయానికి ఎలా రాగలననే ఉద్దేశంతోనే స్వలింగ సంపర్కం సంబంధాల ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకొన్నానని రష్యన్ యువకుడు తన ఫిర్యాదులో పేర్కోన్నారు.
ఇప్పుడు అతనికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఈ విషయం అతని తల్లిదండ్రులకు ఇంకా తెలియదు. ఎలా చెప్పాలో కూడా అతనికి తెలియడం లేదట. ‘‘నా జీవితం పూర్తిగా దెబ్బతింది. నేనెప్పటికీ తిరిగి సాధారణంగా ఉండలేను దీనికి కారణం ఆపిల్ కంపెనీ చేసిన తప్పుడు పనేనని వాపోతున్నాడు. ఆ పనే నన్ను హోమోసెక్సువాలిటీ వైపు నడిపించిదని మండిపడుతున్నాడు.
కాగా క్రిప్టో కరెన్సీ అంటే వర్చువల్ మనీ అనే సంగతి విదితమే. బిట్‌కాయిన్, గే కాయిన్ అనేవి క్రిప్టోకరెన్సీలకు సంబంధించినవి. ఫిర్యాదిదారు ఐఫోన్ యాప్ నుంచి అంటే థర్డ్ పార్టీ యాప్ నుంచి ఈ ఆర్డర్ చేశారు.