Russia Plane Crash Video: రష్యాలో ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సైనిక విమానం, 15 మంది మృతి

ఈ క్రమంలోనే ఇరుదేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ తమ ఐఎల్‌-76 సైనిక విమానాన్ని కూల్చేసిందని రష్యా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.

Russia Plane Crash (PIC Credit : X)

Moscow, March 13: రష్యాలో సైనిక విమానం (Russia Plane Crash) కుప్పకూలింది. రష్యా సైన్యానికి చెందిన ఐఎల్‌-76 రవాణా విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవోలో (Russia Plane Crash) కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించి రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు కోసం హుటాహుటిన మిలిటరీ కమిషన్‌ను ఇవనోవో ఎయిర్‌బేస్‌కు పంపినట్లు తెలిపింది.

 

కాగా, గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుండటంతో రష్యాలో సైనికులు, సైనిక సామాగ్రి రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ తమ ఐఎల్‌-76 సైనిక విమానాన్ని కూల్చేసిందని రష్యా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.



సంబంధిత వార్తలు