Russia-Ukraine war Updates: చైనా జోక్యంతో మొత్తబడ్డ పుతిన్, ఉక్రెయిన్ అధికారులతో చర్చించేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటన, బెలారస్ లో చర్చిద్దాం రండి! అంటూ రష్యా అధ్యక్షుడి కార్యాలయం ప్రకటన
ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. చర్చలకు బెలారస్ రాజధాని మిన్‌స్క్‌కు (Minsk) రష్యా బృందాన్ని పంపిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు తాము సిద్ధమేనంటూ ఇప్పటికే రష్యా విదేశాంగశాఖ మంత్రి స్పష్టం చేశారు.
Moscow, Feb 25: రష్యా- ఉక్రెయిన్ (Russia Ukraine) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పుతిన్ (Putin) కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. చర్చలకు బెలారస్ రాజధాని మిన్‌స్క్‌కు (Minsk) రష్యా బృందాన్ని పంపిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు తాము సిద్ధమేనంటూ ఇప్పటికే రష్యా విదేశాంగశాఖ మంత్రి స్పష్టం చేశారు. తాజాగా రష్యా అధ్యక్ష కార్యాలయం కూడా ఇలాంటి ప్రకటన చేయడం విశేషం. యుద్ధం ఆపేందుకు ప్రపంచదేశాలు చేస్తున్న పర్యటనలతో ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని ఆయన కూడా సూచించారు.
మరోవైపు యుద్ధాన్ని ఆపాలని.. చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) రష్యాను కోరారు. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్ కూడా కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సేనలు ‘ఆయుధాలు వీడితే’ చర్చలకు సిద్ధమని ప్రకటించారు.
‘‘ఉక్రెయిన్ వాసులకు అణచివేత నుంచి స్వేచ్ఛ కల్పించేందుకే ఈ సైనిక ఆపరేషన్ చేపట్టాం. దీని తర్వాత వారు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు. అయితే ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగుతోంది. ఒకవేళ ఉక్రెయిన్ ఆర్మీ సేనలు ఆయుధాలు వదలిపెడితే ఆ దేశంలో మేం చర్చలు జరిపేందుకు సిద్ధం’’ అని సెర్గీ లావోస్ ప్రకటించారు.