Salmonella Outbreak: అమెరికాను వణికిస్తున్న ఎర్ర ఉల్లిపాయ, యుఎస్, కెనడాలో పెరుగుతున్న సాల్మొనెల్లా కేసులు, ఎరుపు రంగు ఆనియన్స్ ద్వారా వ్యాధి వస్తుందని తెలిపిన సీడీసీ
కరోనాతో ఇప్పటికే వణికిపోతున్న అమెరికాకు (America) ఉల్లి రూపంలో మరో ప్రమాదం ఎదురవుతోంది. అమెరికాలో ఉల్లిపాయలు ఓ భయంకరమైన వ్యాధిని (Salmonella Outbreak) కలిగిస్తున్నాని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(CDC) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడాలో (Canada) సాల్మొనెల్లా(ఫుడ్ పాయిజన్ కలిగించే బ్యాక్టీరియా) మహమ్మారి కేసులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయని సీడీసీ (Centers for Disease Control and Prevention) తెలిపింది.
Washington, August 6: అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు రెడ్ ఆనియన్స్ (Red Onions) చుక్కలు చూపిస్తోంది. కరోనాతో ఇప్పటికే వణికిపోతున్న అమెరికాకు (America) ఉల్లి రూపంలో మరో ప్రమాదం ఎదురవుతోంది. అమెరికాలో ఉల్లిపాయలు ఓ భయంకరమైన వ్యాధిని (Salmonella Outbreak) కలిగిస్తున్నాని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(CDC) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడాలో (Canada) సాల్మొనెల్లా(ఫుడ్ పాయిజన్ కలిగించే బ్యాక్టీరియా) మహమ్మారి కేసులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయని సీడీసీ (Centers for Disease Control and Prevention) తెలిపింది.
ఇప్పటి వరకు మొత్తం 34 రాష్ట్రాల్లో 400 మందికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు అధికారులు వెల్లడించారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుందని సీడీసీ తెలిపింది. ఫలితంగా అక్కడి వారికి డయేరియా (విరేచనాలు), జ్వరం, కడుపు నొప్పి వంటివి వస్తున్నాయి. ఇది ఒక్కొక్కరిలో ఆరు గంటలపాటూ ఉంటుంది. బ్యాక్టీరియా సోకిన ఆరు గంటల తర్వాత ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరిలో ఆరు రోజుల తర్వాత కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయంటుని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.
Here's What said CDC:
అమెరికా, కెనడాకు నౌకల్లో వెళ్లిన ఎర్ర ఉల్లిపాయల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా చేరిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉల్లిపాయలు అమెరికాలోని 50 రాష్ట్రాలతోపాటూ, కెనడాలోని అన్ని సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు ఆగస్ట్ 1న సరఫరా అయ్యాయి. వీటిలో ఎరుపు, పసుపు, తెలుపు, తీపి పసుపు రంగు ఉల్లిపాయలున్నాయి. వీటన్నింటిలో కన్నా కూడా ఎర్ర ఉల్లిపాయల్లో ఎక్కువగా సాల్మొనెల్లా వైరస్ ఉన్నట్లు సీడీసీ గుర్తించింది. థాంప్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వచ్చిన అన్ని రకాల ఉల్లిపాయలనూ వాడవద్దని సీడీసీ జనాలను హెచ్చరించింది. లెబనాన్ కన్నీటి ఘోష, బీరూట్ పేలుళ్లలో 100 మందికి పైగా మరణం, శిథిలాల కింద మరికొందరు.., 3 బిలియన్ డాలర్లకు పైగా నష్టం, సహాయం చేయాలని మిత్రదేశాలను కోరిన ప్రధాని
అయితే సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవు. 8 గంటల నుంచి 72 గంటల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 4 రోజుల నుంచి 7 రోజుల పాటూ ఉంటాయి. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయి. చాలా మంది డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండానే రికవరీ అవుతారు. ముసలి వాళ్లు, పిల్లలకు ఈ సమస్య వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడమే మేలు. సాల్మొనెల్లో సోకితే... ఎక్కువ నీరు తాగాలని డాక్గర్లు సూచిస్తున్నారు.