China Restaurant Blast Video: చైనాలో భారీ పేలుడు, రెస్టారెంట్లో గ్యాస్ పేలి చెలరేగుతున్న మంటలు, చుట్టుపక్కల భవనాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసం (వీడియో ఇదుగో)

ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్‌ పేలుడు (China Blast) సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

China Restaurant Blast (PIC@ X)

Beijing, March 13:  చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో (Yanjiao) బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు (Explosion) సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్‌ పేలుడు (China Blast) సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత (Yanjiao) భారీ నీలి  మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది.

 

ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రెస్క్యూటీమ్‌ సహాయక చర్యలు మొదలు పెట్టింది.



సంబంధిత వార్తలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌