SFTS Virus in China: చైనాలో మరో ప్రమాదకర వైరస్, ఎస్ఎఫ్‌టీఎస్ దెబ్బకు ఏడు మంది మృతి, 60 మంది ఆస్పత్రిలో చేరిక, మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ

ఈ ప్రమాదకర వైరస్ (SFTS Pandemic) ధాటికి అక్కడ ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మ‌రో 60 మంది దీని బారిన ప‌డ్డారు. ఎస్ఎఫ్‌టీఎస్ (సివియ‌ర్ ఫీవ‌ర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్) (Severe fever with thrombocytopenia syndrome) వైరస్‌గా పిలుస్తోన్న ఈ వైరస్ మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని చైనా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు చైనా అధికారిక మీడియా గ్లోబ‌ల్ టైమ్స్‌ బుధ‌వారం క‌థనాన్ని వెలువ‌రించింది.

Medical workers (Photo Credits: IANS)

Beijing, August 5: కరోనావైరస్ కల్లోలం మరచిపోకముందే చైనాలో మరో భయంకరమైన వైరస్ ( Another Virus in China) వెలుగు చూసింది. ఈ ప్రమాదకర వైరస్ (SFTS Pandemic) ధాటికి అక్కడ ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మ‌రో 60 మంది దీని బారిన ప‌డ్డారు. ఎస్ఎఫ్‌టీఎస్ (సివియ‌ర్ ఫీవ‌ర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్) (Severe fever with thrombocytopenia syndrome) వైరస్‌గా పిలుస్తోన్న ఈ వైరస్ మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని చైనా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు చైనా అధికారిక మీడియా గ్లోబ‌ల్ టైమ్స్‌ బుధ‌వారం క‌థనాన్ని వెలువ‌రించింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వ‌ర‌కు తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో (East China’s Jiangsu Province) 37 కేసులు న‌మోద‌వ‌గా గ‌త నెల‌లో ఒక్క‌ అన్హూయ్ ప్రావిన్స్‌లోనే 23 కేసులు వెలుగు చూసాయని గ్లోబ‌ల్ టైమ్స్‌ తన కథనంలో తెలిపింది. అయితే ఈ వైర‌స్ (SFTS Virus outbreak in China) కొత్త‌దేమీ కాదని 2010లో తొలిసారిగా చైనాలో ఇది ఉనికిలోకి వ‌చ్చిందని తెలుస్తోంది. ఆ త‌ర్వాత జ‌పాన్, కొరి‌యాల్లోనూ ఈ త‌ర‌హా కేసులు వెలుగు చూశాయి. అమెరికాను వణికిస్తున్న ఎర్ర ఉల్లిపాయ, యుఎస్, కెనడాలో పెరుగుతున్న సాల్మొనెల్లా కేసులు, ఎరుపు రంగు ఆనియన్స్ ద్వారా వ్యాధి వస్తుందని తెలిపిన సీడీసీ

ఈ వైర‌స్ వచ్చిన వారిలో ప్రధానంగా జ్వ‌రం, దగ్గు ల‌క్ష‌ణాలు తీవ్రంగా క‌నిపిస్తాయి. ఈ వైరస్ మ‌ర‌ణాల రేటు 10-16 శాతంగా ఉంది. అయితే ప‌దేళ్ల త‌ర్వాత మళ్లీ ఈ ఎస్ఎఫ్‌టీఎస్ వైర‌స్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం అక్కడి వాసుల్లో ఆందోళ‌న క‌లిగుతోంది. ఇది ఎలా వ్యాపిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ న‌ల్లి(టిక్‌) వంటి కీట‌కాల ద్వారా ఈ వైర‌స్ వ్యాపించి ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. చైనాలో మళ్లీ కొత్తగా బుబోనిక్‌ ప్లేగు, ఈ వైరస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మంగోలియాపై అప్పుడే పంజా విసురుతున్న బుబోనిక్‌ ప్లేగు వైరస్

అయితే మనిషి ర‌క్తం, శ్లేషం ద్వారా కూడా ఇది సంక్ర‌మిస్తుందని ఝెజియాంగ్ యూనివ‌ర్సిటీ ఆసుప‌త్రి వైద్యులు షెంగ్ జిఫాంగ్ పేర్కొన్నారు. అలాగే మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు వ్యాపించేందుకు కూడా ఆస్కారం లేక‌పోలేద‌ని చెప్పుకొచ్చారు. అయితే ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నంత కాలం దీని గురించి పెద్ద‌గా భ‌య‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని వైద్యులు అంటున్నారు.