lockdown Extension: జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న సింగపూర్ ప్రభుత్వం, 9,125కు చేరిన కరోనా కేసుల సంఖ్య

జూన్ ఒకటి దాకా లాక్‌ డౌన్ (Coronavirus lockdown) పొడిగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు మూసి ఉంచుతారు. మే నాలుగో తేదీకి లాక్‌డౌన్ (Singapore lockdown) పూర్తి కావాల్సి ఉన్నా మరో నాలుగువారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని లీ లూంగ్ (PM Lee Hsien Loong) ప్రకటించారు. సింగపూర్‌లో ఇప్పటివరకూ 9,125 కరోనా కేసులు నమోదయ్యాయి.

Pedestrians in Singapore wearing face mask | (Photo Credits: AFP)

Pulau Ujong, April 21: కరోనావైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ ఒకటి దాకా లాక్‌ డౌన్ (Coronavirus lockdown) పొడిగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు మూసి ఉంచుతారు. మే నాలుగో తేదీకి లాక్‌డౌన్ (Singapore lockdown) పూర్తి కావాల్సి ఉన్నా మరో నాలుగువారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని లీ లూంగ్ (PM Lee Hsien Loong) ప్రకటించారు. సింగపూర్‌లో ఇప్పటివరకూ 9,125 కరోనా కేసులు నమోదయ్యాయి.కిమ్ జోంగ్ ఉన్ 'బ్రెయిన్ డెడ్' అయ్యారా? ఉత్తర కొరియా దేశాధినేత ఆరోగ్య పరిస్థితిపై వార్తలు, గత కొంతకాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటోన్న కిమ్, ఆ దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులు

కాగా వలస కార్మికుల ద్వారా కొత్తగా 1111 కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఆసియా దేశాలకు చెందిన కూలీలు ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేస్తుంటారు. సింగపూర్‌ పరిశ్రమలు వీరిపైనే ఆధారపడ్డాయి. సింగపూర్‌లో ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున కరోనా కేసులు నమోదవుతున్నాయి.

మంగళవారం నాటికి రెండో రోజు కూడా సింగపూర్‌లో రోజుకు 1,000 కేసులు చొప్పున నమోదయ్యాయి. కొత్త కేసులలో ఎక్కువ భాగం వసతి గృహాలలో నివసిస్తున్న వలస కార్మికులవే. కార్మికుల వసతి గృహాలలో COVID-19 వ్యాప్తి ఫలితంగా సింగపూర్‌లో కరోనావైరస్ కేసులు పెరిగాయి. సోమవారం, సింగపూర్‌లో 1,426 కొత్త ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. కాగా, జాన్స్ హాప్కిన్స్ కరోనావైరస్ ట్రాకర్ ప్రకారం, దేశంలో మొత్తం COVID-19 కేసులు 9 మరణాలు 9గా ఉన్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif