Space One Rocket Explodes: గాల్లోకి ఎగిరిన క్షణాల్లో పేలిపోయిన రాకెట్, అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు ముందుకు వేయాలన్న జపాన్ అడుగులకు బ్రేక్, చెల్లాచెదురుగా పడిపోయిన శిథిలాలు (వీడియో ఇదుగోండి)

కైరోస్‌ రాకెట్‌ ప్రభుత్వానికి చెందిన శాటిలైట్‌ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్‌ పేలిపోవడంతో భారీగా మంటలు ((Space One rocket explodes)) ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి.

Space One Rocket Explodes (PIC Credit: BNO News)

Tokyo, March 13:  వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్‌ (Japan)  ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ కైరోస్‌ లాంచ్‌ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది (Space One rocket explodes). ఈ రాకెట్‌ నింగిలోకి ఎగిరితే జపాన్‌ చరిత్రలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ నింగిలోకి ఎగిరిన  రికార్డు క్రియేట్‌ అయ్యేది. ఈ రాకెట్‌ను స్పేస్‌ వన్‌ (Space One rocket) అనే స్టార్టప్‌ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్‌ రాకెట్‌ ప్రభుత్వానికి చెందిన శాటిలైట్‌ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది.

 

రాకెట్‌ పేలిపోవడంతో భారీగా మంటలు ((Space One rocket explodes)) ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్‌ మార్చ్‌ 9వ తేదీనే లాంచ్‌ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్‌ వాయిదాపడింది. రాకెట్‌ పేలిపోవడంతో స్పేస్‌ వన్‌ కంపెనీ షేర్లు జపాన్‌ స్టాక్‌మార్కెట్‌లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి.