Sri Lanka: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గోటబయ రాజపక్స, అధ్యక్ష పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో గోటబయ సారత్యంలోని ఎస్‌ఎల్‌పిపి పార్టీ ఘన విజయం
తన అన్నయ్య మహీంద రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్న (2005-2015) కాలంలో ఆయన శ్రీలంక రక్షణ మంత్రి పదవిని చేపట్టారు. కాగా, ప్రస్తుతం...
శ్రీలకం ద్వీప దేశం ( island nation) మొత్తం 25 జిల్లాలను కలిగి ఉంది, వీటిని తొమ్మిది ప్రావిన్సులుగా విభజించారు. శనివారం పోలింగ్ సందర్భంగా మొత్తం 12,845 కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. . శ్రీలంకలో దాదాపు 16 మిలియన్ల మంది ఓటర్లు ఉండగా, దాదాపు 80 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆ దేశ జాతీయ ఎన్నికల సంఘం తెలిపింది.
ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో గోటబయ రాజపక్స సారథ్యంలోని శ్రీలంక పొడుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి) పార్టీ ఘన విజయం సాధించింది. తమకు సుమారు 54 శాతం మెజారిటీ లభించిందని SLPP అధికార ప్రతినిధి కెహెలియా రాంబుక్వెల్లా తెలిపారు. ఈ విజయంతో గోటబయ రాజపక్స శ్రీలంక 8వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈరోజు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన గోటబయ గతంలో రిటైర్డ్ సైనికుడు. తన అన్నయ్య మహీంద రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్న (2005-2015) కాలంలో ఆయన శ్రీలంక రక్షణ మంత్రి పదవిని చేపట్టారు. కాగా, ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న మైత్రిపాల సిరిసేన ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.