Sun Explosion : భూమికి మరోముప్పు, ఇవాళ భూమిని తాకనున్న సౌరతుఫాన్, హీట్ వేవ్ పెరిగే అవకాశం, కమ్యూనికేషన్ శాటిలైట్లు దెబ్బతినే ఛాన్స్, సౌర తుఫాన్ తీవ్రతపై అధ్యయనం చేస్తున్న సైంటిస్టులు
అత్యంత వేగంగా దూసుకొస్తున్న సౌర తుఫాన్ (Solar Strom) గురువారం రోజున భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. సౌర తుఫాను (Sun Explosion) కారణంగా భూమిపై తీవ్ర ప్రభావంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. దాదాపు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాన్ దూసుకొస్తోంది. ఈ రోజు ఏ క్షణమైనా భూమిని (Earth) సౌర తుఫాన్ ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు.
New Delhi, March 31: భూమికి మరో ముప్పు ముంచుకొస్తుంది. అత్యంత వేగంగా దూసుకొస్తున్న సౌర తుఫాన్ (Solar Strom) గురువారం రోజున భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. సౌర తుఫాను (Sun Explosion) కారణంగా భూమిపై తీవ్ర ప్రభావంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. దాదాపు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాన్ దూసుకొస్తోంది. ఈ రోజు ఏ క్షణమైనా భూమిని (Earth) సౌర తుఫాన్ ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే… మార్చి 28న సూర్యుడిపై రెండు రీజియన్లలో భారీగా విస్పోటనాలు జరిగాయి. దాంతో అక్కడ కరోనల్ మాస్ఎజెక్షన్ (Coronal Mass Ejection) రిలీజైంది. దీని కారణంగా హీట్ వేవ్ (Heat Wave) భారీ స్థాయిలో వెలువడింది. ఇప్పుడు అది అంతరిక్షంలో అత్యంత వేగంతో పయనిస్తోంది. భారీ విస్పోటనం జరిగినప్పటి నుంచి మూడు రోజులుగా సూర్యుడి నుంచి తీవ్ర స్థాయిలో జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ భారీ వేడి తరంగాలు భూమిని ఢీకొట్టనున్నాయి. ఈ సోలర్ స్ట్రోమ్ భూమిపై ఉండే అయస్కాంత తరంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
21 లక్షల 85 వేల 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ సోలార్ తుఫాన్ వేగం.. భూమిని చేరుకునేసరికి 496 నుంచి 607 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సోలార్ వేవ్ ప్రభావానికి శాటిలైట్లు గతి తప్పే అవకాశం ఉంది. శాటిలైట్లలోని కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో సౌర తుఫాన్ బారిన పడి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్‌కు (Space X)చెందిన 40 శాటిలైట్లు పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు కూడా శాటిలైట్లపై (Sattilite) సౌర తుఫాను ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు సైంటిస్టులు.
ఈ బహుళ బహుళ భూ అయస్కాంత తుఫానులు భూమిపై ప్రభావం (Effect on earth) చూపుతాయని భావిస్తున్నారు. సౌర కొరోనా అంతరిక్షంలోకి నిలిచిపోవడం ద్వారా భూ అయస్కాంత తుఫానులు ఏర్పడతాయి. ఈ తుఫానులు ఎక్కువగా భూమి ఎగువ వాతావరణాన్ని ప్రభావం చూపిస్తాయి. తక్కువ-కక్ష్యలో ఉన్న వస్తువులపై తనలోకి లాగేసుకుంటాయి. నివేదికల ప్రకారం.. ‘కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు (CMEలు) కరోనల్ హోల్ హై-స్పీడ్ కలయిక ఫలితంగా భూమివైపు దూసుకొచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ మెట్ ఆఫీస్ హెచ్చరించింది.
రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు (Solar Storms) వచ్చే అవకాశం ఉంది. భౌగోళిక అయస్కాంత తుఫానుల పెరిగిన ఫ్రీక్వెన్సీ సౌర ప్రాంతం AR2975తో ముడిపడి ఉందని సైంటిస్టులు గుర్తించారు. శక్తివంతమైన భూ అయస్కాంత తుఫాను వేడి రేడియేషన్ కారణంగా దాని మార్గంలోని ఉపగ్రహాలను నాశనం చేయగలదు. అంతేకాదు.. సున్నితమైన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే GPS సిస్టమ్‌లు, సెల్ ఫోన్‌లు, ఇంటర్నెట్ సేవలు పవర్ గ్రిడ్‌లకు కూడా అంతరాయం కలుగుతుంది. ఎయిర్‌ప్లేన్ నావిగేషన్ సిస్టమ్‌ల నుంచి ఆస్పత్రులు, ప్రైమరీ కేర్ సర్వీస్‌ల వరకు ప్రతిదీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది.