Weather Forecast: ఎండలు బాబోయ్ ఎండలు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వడగాడ్పులు, తెలంగాణలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
Image Used For Representational Purposes (Photo Credits: JBER)

Amaravati, Mar 28: తెలుగు రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే వడగాడ్పులు రంగప్రవేశం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎండలు (Heat Wave) పెరుగుతున్నాయి. క్రమేపి పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది. మరోవైపు విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ఉపరి తల ద్రోణి ఈరోజు విదర్భనుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9 కిమి ఎత్తు వరకు కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇక ఏపీలో వేసవి ఆరంభంలోనే వడగాడ్పులు (Heat Waves in AP) రంగప్రవేశం చేస్తున్నాయి. మార్చి 29న పలు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. మంగళవారం నాడు విజయనగరం జిల్లా కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 17 జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. కృష్ణా జిల్లాలో 12 మండలాలు, విశాఖ జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 14, శ్రీకాకుళం జిల్లాలో 7, కర్నూలు జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 3, కడప జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్ విడుదల, ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

రాగల మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వచ్చే ఐదురోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు (Heat Waves in TS) పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అక్కడక్కడ పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచే మాడు పగిలేలా ఎండలు దంచుతున్నాయి. ఓ వైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. నివాసాలు, కార్యాలయాలు, ఇతరత్రా ప్రదేశాల్లో చల్లగా ఉండడం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది.

ఏపీకి గుడ్ న్యూస్..విశాఖ రిఫైన‌రీ ఆధునికీక‌ర‌ణ‌ వ్యయం రూ.26,264 కోట్ల‌కు పెంచుతూ కేంద్రం కీలక ప్ర‌క‌ట‌న‌, రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజయ సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన కేంద్రం

ఒక్కరోజులోనే గతంలో ఎప్పుడూ చూడని కరెంటు డిమాండ్ ఉంటోంది. ఇప్పుడే ఇంత డిమాండ్ ఉంటే.. రానున్న రోజుల్లో ఇది అధికం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారీగా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోదని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 2022, మార్చి 28వ తేదీ సోమవారం సాయంత్రం 3.54 నిమిషాల వరకు ఏకంగా 13 వేల 857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధిక విద్యుత్ డిమాండ్ అని అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక విద్యుత్ వినియోగంగా నమోదైందన్నారు. మూడు రోజుల క్రితం 13 వేల 742 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా సోమవారం 13 వేల 857 మెగా వాట్లు నమోదైందన్నారు.