Thailand Warship Capsizes: ఘోర ప్రమాదం, సముద్రంలో మునిగిపోయిన యుద్ధనౌక, 31 మంది గల్లంతు, 75 మందిని కాపాడిన అధికారులు, థాయ్‌లాండ్‌లో విషాద ఘటన

ఈ ఘటనలో (Thailand Warship Capsizes) 75 మందిని కాపాడగా.. మరో 31 మంది గల్లంతయ్యారు. వారి కోసం నౌకలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Image used for representational purpose only | File Photo

Bangkok, December 19: గల్ఫ్‌ ఆఫ్ థాయ్‌లాండ్‌ (Gulf of Thailand)లో విధులు నిర్వహిస్తున్న థాయ్‌ యుద్ధ నౌక (Warship) హెచ్‌టీఎంస్‌ సుఖొథాయ్‌ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో (Thailand Warship Capsizes) 75 మందిని కాపాడగా.. మరో 31 మంది గల్లంతయ్యారు. వారి కోసం నౌకలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

థాయ్‌లాండ్‌ (Thailand)లోని ప్రచుప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్స్‌లో సముద్ర తీరానికి 20 నాటికల్‌ మైళ్ల దూరంలో గస్తీ విధుల్లో పాల్గొన్న ఈ నౌక..బలమైన ఈదురుగాలుల కారణంగా సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరి విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింది. సమాచారమందుకున్న థాయ్‌ నౌకాదళం.. ఆ యుద్ధనౌక వద్దకు మూడు ఫ్రిగెట్లు, రెండు హెలికాప్టర్లను పంపించింది. వారు అక్కడకు చేరుకుని మొబైల్‌ పంపింగ్‌ మిషన్లను నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ, బలమైన గాలుల కారణంగా అది సాధ్యపడలేదు. ఇంజిన్‌ వ్యవస్థ పనిచేయకపోవడం, కరెంట్ లేకపోవడంతో మరింత నీరు నౌక లోపలికి వచ్చింది. దీంతో నెమ్మదిగా నౌక ఓ వైపు ఒరుగుతూ నీటమునిగింది.

చైనాలో కరోనా కల్లోలంపై షాకింగ్ రిపోర్ట్, డ్రాగన్ కంట్రీకి మూడ్ వేవ్‌ల ముప్పు, 10 లక్షలకుపైగా మరణాలు సంభవించే అవకాశం, చైనా నిపుణుల అధ్యయనంలో వెల్లడి

ప్రమాద సమయంలో నౌకలో 106 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మంది నావికులను సహాయక సిబ్బంది కాపాడగా.. మరో 31 మంది కోసం నిన్న అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో నావికుల కోసం గాలిస్తున్నారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను థాయ్‌ నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.