COVID19 Vaccine: కోవిడ్-19కు వాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు! ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల హెచ్చరిక, వైరస్‌తోనే ఎలా జీవించాలో సమాజం నేర్చుకోవాలని సూచన

వైరస్ తో సహజీవనం చేస్తూనే సామాజిక జీవనం గడపాలి, అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ చేసుకోవాలి.....

Clinical Trials. Image used for representational purpose only. | Photo: Pixabay

London, May 5: ఈరోజు ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఏకైక సమస్య కోవిడ్-19. కంటికి కనిపించని ఈ వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ కోసం దాదాపు అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కి పైగా వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి మరియు వాటిలో రెండు మానవ ట్రయల్ దశలోకి కూడా ప్రవేశించాయి. ఈ రెండింటిలో ఒకటి ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చింపాంజీలకు సోకిన వైరస్ ద్వారా అభివృద్ధి చేయబడినది కాగా, మరొకటి యుఎస్‌లో మోడరనా అనే బయోటెక్ సంస్థ అభివృద్ధి పరిచింది.

అయినప్పటికీ, అసలు కోవిడ్-19ను అరికట్టే వ్యాక్సిన్‌ను  శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయలేకపోవచ్చని ప్రముఖ ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలు కావస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా 32 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా హెచ్‌ఐవి- ఎయిడ్స్ వ్యాధికి ఇంత వరకు వ్యాక్సిన్ రాలేదని గుర్తుచేశారు. అలాగే డెంగీ విషయంలో కూడా ఇదే జరిగింది. డెంగీకి కూడా ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదు. కొన్ని దేశాలలో డెంగీ సోకకుండా మందులు ఉన్నప్పటికీ వాటి పనితీరుపై ఇంకా స్పష్టత లేదని చెప్పారని అంతర్జాతీయ మీడియా CNN తన రిపోర్టులో వెల్లడించింది. కరోనాకు తోడయిన మరో వైరస్, ‘ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ’ ధాటికి పందులు...

"కరోనావైరస్‌కు వ్యాక్సిన్ (COVID19 Vaccine) ఎప్పటికీ రాకపోవచ్చు, ఇప్పటికీ వ్యాక్సిన్ లేని కొన్ని వైరస్ లు మనుగడలో ఉన్నాయి. ఒకవేళ టీకా వచ్చినా దాని సమర్థత మరియు సురక్షిత ప్రమాణాలకు సంబంధించిన అన్ని పరీక్షలలో సంపూర్ణ ఉత్తీర్ణత సాధిస్తుందా? అనేది చెప్పలేం" అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రత్యేక రాయబారిగా (WHO envoy) వ్యవహరిస్తున్న ఆరోగ్య నిపుణులు డా. డేవిడ్ నబారో (Dr David Nabarro) పేర్కొన్నారు.

"ప్రజలు కరోనావైరస్ టీకాపై చాలా ఆశలు పెట్టుకుంటున్నారు, వారి ఆశలు ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ఎందుకంటే వ్యాక్సిన్ ప్రయోగాలు అనేవి మనుషుల ప్రాణాలపై చేసే ప్రయోగాల లాంటివి, యంత్రాలపై చేసే ప్రయోగాలు కావు. మనిషి శరీరం ఎలా స్పందిస్తుందనే దానిపై వ్యాక్సిన్ అభివృద్ధి ఆధారపడుతుంది. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి అనేది సుదీర్ఘమైన అని బాధాకరమైన ప్రక్రియ" అని డా. నబారో అసహనం వ్యక్తం చేశారు.  విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను మే 7 నుంచి దశల వారీగా స్వదేశానికి తరలింపు

మరొక ఆరోగ్య నిపుణులు అమెరికా- హ్యూస్టన్‌లోని బేలర్ మెడికల్ కాలేజ్‌ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ మాట్లాడుతూ "వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ అనేది ఎప్పటికీ వేగవంతం చేయలేము. ఒక ఏడాదిలో వ్యాక్సిన్ లేదా 18 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం అనేది అసాధ్యం కాకపోవచ్చు, కానీ అది వీరోచితమైన ప్రకటన. మనకు ప్లాన్ ఎ విఫలమైతే ప్లాన్ బి ఉండటం కూడా అవసరమే" అని

అని అన్నారు.

మరోవైపు, హెచ్ఐవీ లేదా డెంగీ వైరస్ ల కంటే కరోనావైరస్ వృద్ధిరేటు నెమ్మది కాబట్టి దీనికి వ్యాక్సిన్ అభివృద్ధి సాధ్యపడవచ్చు అని మరికొంత మంది నిపుణులు తెలిపారు.

అయితే, కోవిడ్ -19 ను అరికట్టే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు మనంతగా మనమే స్వీయ నియంత్రణ చేసుకోవడం, పరిస్థితులను అలవాటు చేసుకోవడం ఉత్తమం అని డా. నబారో చెప్పారు.

"ప్రతిచోటా, ప్రతీ సమాజం కరోనావైరస్ ముప్పు నుండి నిరంతరం తమను తామే రక్షించుకోగలిగే పరిస్థితులకు అలవాటుపడాలి. వైరస్ తో సహజీవనం చేస్తూనే సామాజిక జీవనం గడపాలి, అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ చేసుకోవాలి". అని డా. డేవిడ్ నబారో కమెంట్స్ ను CNN నివేదించింది.