Guwahati, May 4: దేశంలో కరోనా వైరస్ (Coronavirus) కల్లోలం మరచిపోకముందే మరో వైరస్ దేశంలోకి ఎంటరయింది. అస్సాంలో (Assam) తాజాగా మరో వైరస్ వెలుగుచూసింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూగా (African Swine Flu) పిలిచే ఈ వైరస్ తొలిసారిగా అస్సాంలో బయటపడిందని ప్రభుత్వం వెల్లడించింది. భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ( NIHSAD) ఈ వైరస్‌ను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ఎఎస్ఎఫ్) అని ధృవీకరించినట్లు తెలిపింది. అయితే ఈ వైరస్ వల్ల మనుషులకు పెద్దగా ప్రమాదం లేదని, దీనికి కోవిడ్‌తో ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.
ఇదిలా ఉంటే అస్సాంలో ఇప్పటివరకు 306 గ్రామాల్లో ఈ వైరస్ ప్రబలి 2,500 పందులు (Pigs) మరణించాయి. పందుల లాలాజలం, రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీని నివారణకు పందులను సామూహికంగా చంపేందుకు కేంద్రప్రభుత్వం (Central Govt) అనుమతినిచ్చింది. అయితే తాము ఆ పనిని చేయమని, ప్రత్యామ్నాయ పద్దతుల్లో అడ్డుకట్ట వేస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు
వైరస్ ప్రబలిన జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు పందుల రవాణా ఆపేశామని తెలిపింది. పొరుగు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అస్సాం పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా అన్నారు. ఈ వైరస్ ఇంకా పెద్దగా వ్యాప్తిచెందలేదని, ఇప్పటికే నమూనాలు సేకరించి మూడు ప్రత్యేక ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో వైన్ షాపు వద్ద లాఠీఛార్జ్, సామాజిక దూరాన్ని పాటించని ఢిల్లీ మద్యం ప్రియులు, వైన్ షాపు మూసివేసిన పోలీస్ అధికారులు
2019 ఏప్రిల్‌లో ఈ వైరస్ చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్ గ్రామంలో బయటపడిందని, అక్కడినుంచి అరుణాచల్ మీదుగా అస్సాంలో వ్యాధి ప్రబలడానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే వైరస్ పెద్దగా ప్రమాదం కాదని, వ్యాధి ప్రబలని ప్రాంతాల్లో పంది మాంసం తినొచ్చని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొన్నారు.