New Delhi, May 4: మూడవ దశ లాక్ డౌన్ (Delhi Lockdown 3.0) లో భాగంగా మద్యం షాపులు తెరుచుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం (Central Govt) రాష్ట్రాలకు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైన్ షాపులను (WineShops) తెరిచారు. మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు నిర్ణయం ఎలా ఉండబోతోంది, స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి అమల్లోకి ఈ పాస్ విధానం, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం విజ్ఞప్తి
40 రోజుల లాక్‌డౌన్ (India Lockdown) తర్వాత పలు రాష్ట్రాల్లో మద్యం షాపులను ఓపెన్ చేయడంతో భారీ సంఖ్యలో జనం షాపుల ముందు నిలబడ్డారు. ఉదయం నుంచే షాపుల ముందు జనం క్యూ కట్టారు. కొన్ని చోట్ల సామాజిక దూరాన్ని పాటిస్తున్నామరికొన్ని చోట్ల జనం మరీ ఎక్కువ సంఖ్యలో ఉండడంతో.. సోషల్ డిస్టెన్సింగ్ నియమాన్ని పట్టించుకునేవారు లేరు.
ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్‌లో ఉన్న మద్యం షాపు వద్ద భారీ క్యూలైన్‌లో జనం నిలబడ్డారు. సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో.. కశ్మీరీ గేటు ప్రాంతంలో ఉన్న వైన్‌షాపు వద్ద లాఠీచార్జ్ (Lathicharge Outside Liquor Shop) జరిగింది. రెసిడెన్షియల్ ప్రాంతాల్లోనూ ఉన్న వైన్ షాపుల్లోనూ మద్యం అమ్మేందుకు అనుమతి ఇచ్చారు. ANI విడుదల చేసిన ఒక వీడియో ప్రకారం, ప్రజలు మద్యం కొనడానికి వీధుల్లోకి వచ్చారు.
Take a look at the Video:
#WATCH: Police resorts to mild lathicharge outside a liquor shop in Kashmere Gate after social distancing norms were flouted by people outside the shop. #Delhi pic.twitter.com/XZKxrr5ThC
— ANI (@ANI) May 4, 2020
మద్యం విక్రయించే దుకాణం వెలుపల ఒక లైన్లో అందరూ దగ్గరగా నిలబడి ఉన్నారు. మద్యం కొనడానికి వరుసలో ఉన్న పెద్ద సంఖ్యలో ప్రజలు సామాజిక దూరాన్ని కొనసాగించలేదు. దీంతో పోలీసులు అక్కడ లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అలాగేప్రజలు సామాజిక దూరాన్ని పాటించకపోవడంతొ కరోల్ బాగ్‌లోని మద్యం దుకాణాన్ని పోలీసులు మూసివేశారు. ఈ మద్యం దుకాణంలో ప్రజలు సామాజిక దూరాన్ని కొనసాగించలేదు, అందువల్ల మేము దానిని మూసివేసామని కరోల్ బాగ్ SHO మనీందర్ సింగ్ తెలిపారు. ఏపీలో మూడవ దశ లాక్‌డౌన్, గ్రీన్ జోన్లలో 25 శాతం పెంపుతో మద్యం అమ్మకాలు, కంటైన్‌మెంట్ క్లస్టర్ల ప్రాతిపదికగా సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
దేశ రాజధానిలోని COVID-19 కంటైనేషన్ జోన్ల వెలుపల ఉన్న 150 మద్యం దుకాణాలు మే 4 నుండి ప్రారంభించబడ్డాయి. కాగా 'కంటెమెంట్ జోన్'లుగా ప్రకటించబడిన ప్రదేశాలలో మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతించలేదు. ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్ వద్ద మద్యం దుకాణం వెలుపల కిలోమీటర్ కంటే ఎక్కువ పొడవు గల క్యూ కనిపించింది. తెరుచుకోనున్న మద్యం షాపులు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు
ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం మే 4, సోమవారం నుండి మే 17 వరకు రెండు వారాల పాటు లాక్డౌన్ను పొడిగించింది. దేశ రాజధానిలోని 97 కంటైనర్ జోన్లలో ఎటువంటి సడలింపులు ఇవ్వలేదు. లాక్డౌన్ సమయంలో, ప్రైవేట్ కార్యాలయాలు అవసరానికి అనుగుణంగా 33 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించబడతాయి. ఇంతలో, నాన్-ఎసెన్షియల్ కేటగిరీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు డిప్యూటీ సెక్రటరీ స్థాయి మరియు అంతకంటే ఎక్కువ ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. మిగిలిన సిబ్బంది అవసరానికి అనుగుణంగా 33 శాతం వరకు హాజరవుతారు. దేశ వ్యాప్తంగా 11 వేల మందికి పైగా డిశ్చార్జ్, 42 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, 1300 దాటిన మరణాలు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్ 3.0
దేశ వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో మినహా అనేక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక చత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నందగావ్ ప్రాంతంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జనం ఎవరూ సోషల్ డిస్టాన్సింగ్ నియమాన్ని పాటించడంలేదు. ఆ రాష్ట్రంలో కీలకమైన కంటెయిన్‌మెంట్ జోన్లలో మినహా మిగితా అంతటా మద్యం అమ్మకాలను ప్రారంభించారు. బెంగుళూరులో కూడా జనం లిక్కర్ షాపు ముందు క్యూకట్టారు. ఆ రాష్ట్రంలో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మేందుకు అనుమతులు ఇచ్చారు.