Thiruvananthapuram, September 22: నిపా వైరస్ కారణంగా కేరళలో 12 ఏళ్ల చిన్నారి మరణించిన కొన్ని రోజుల తర్వాత, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా, ఈ అంటువ్యాధిని నివారించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేరళలోని పశుసంవర్ధక మరియు పాడి అభివృద్ధి మంత్రి జె చించ్రాణికి PETA లేఖ రాసింది. "మాంసం పరిశ్రమ యొక్క రద్దీ, జంతువుల కేంద్రాలు వంటివి జూనోటిక్ వ్యాధులకు హాట్‌స్పాట్‌లను సృష్టిస్తాయని పెటా తెలిపింది. ఈ నేపథ్యంలో పందుల పెంపకానికి సంబంధించిన కేంద్రాలను వెంటనే మూసివేయాలని లేఖలో కోరింది.
ఢిల్లీలో, 11 ఏళ్ల బాలుడు H5N1 వ్యాధితో మరణించాడు. బర్డ్ ఫ్లూ, జూలైలో 60 శాతం మరణాల రేటును కలిగి ఉందని పెటా తెలిపింది. ఈ నేపథ్యంలో నిపా మహమ్మారిని నివారించడానికి పిగ్ ఫామ్‌లను మూసివేయాలని పెటా (PETA Asks State Govt) తెలిపింది. ఈ పెంపకం ఇలాగే కొనసాగితే మరింత మంది ప్రాణాలు కోల్పోతారని (Nipah Virus Scare in Kerala) తెలిపింది. వాటిని శాశ్వతంగా మూసివేయాలని (Shut Pig Farms To Prevent Epidemic) పెటా ఇండియా వేగన్ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్ అహుజా అన్నారు. జంతువుల ఆరోగ్యం కోసం ప్రపంచ సంస్థ హెచ్చరిస్తుంది, నిపా వైరస్ పందుల నుండి సంక్రమిస్తోంది.
దేశంలో నిన్న కొత్తగా 26,964 కరోనా కేసులు, మరో 383 మంది మృతి, కేరళలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు
ఇదొక అంటువ్యాధి మరియు వినాశకరమైన జూనోటిక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది, అనగా ఇది ఇతర జంతువుల నుండి మానవులకు సోకుతుంది అని పెటా ఇండియా పేర్కొంది. మానవులలో 40 శాతం నుండి 75 శాతం వరకు మరణాల రేటును అంచనా వేసిన నిపా వైరస్‌తో సహా అనేక జూనోటిక్ వ్యాధులు, జంతువుల పెంపకం లేదా చంపేందుకు కలిసి గుమిగూడడం వల్ల జంతువలలో మరియు మానవులలో వ్యాధులు సులభంగా వ్యాప్తి చెందుతాయనిపెటా తెలిపింది.