Coronavirus in India: దేశంలో నిన్న కొత్తగా 26,964 క‌రోనా కేసులు, మ‌రో 383 మంది మృతి, కేరళలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు

దేశంలో నిన్న కొత్తగా 26,964 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,35,31,498కి (Coronavirus in India) చేరింది. అలాగే, నిన్న 34,167 మంది కోలుకున్నార‌ని పేర్కొంది.

Coronavirus in India: దేశంలో నిన్న కొత్తగా 26,964 క‌రోనా కేసులు, మ‌రో 383 మంది మృతి, కేరళలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు
coronavirus Test Representational Image. (File Photo | PTI)

New Delhi, Sep 22: దేశంలో నిన్న కొత్తగా 26,964 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,35,31,498కి (Coronavirus in India) చేరింది. అలాగే, నిన్న 34,167 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 383 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,768కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,27,83,741మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,01,989 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 82,65,15,754డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ( Covid in Kerala ) ప్ర‌భావం కాస్త త‌గ్గింది. రెండు రోజుల క్రితం వ‌ర‌కు భారీగా న‌మోదైన రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య.. గ‌త రెండు రోజులుగా 15 వేలకు ద‌రిదాపుల్లోనే ఉన్న‌ది. ఇవాళ కూడా కొత్త‌గా 15,768 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అదేవిధంగా క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య కూడా ఇవాళ 21,367గా న‌మోదైంది. దాంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 43,54,264కు పెరిగింది.

రూటు మార్చిన కరోనా, గాలి ద్వారా వాయువేగంతో దాడికి రెడీ

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా కేర‌ళ‌లో ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. ఇవాళ కూడా కొత్త‌గా 214 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 23,897కు పెరిగింది. ఇవాళ మొత్తం 1,05,513 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. అందులో 15,768 మందికి పాజిటివ్ వ‌చ్చింది.

(The above story first appeared on LatestLY on Sep 22, 2021 11:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).