New Delhi, Sep 29: వుహాన్‌లో పుట్టిన కరోనా కలకలం రేపుతున్న వేళ.. మరో చైనా వైరస్ (another virus from China)నుంచి దేశానికి ఆరోగ్య విపత్తు పొంచి ఉందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) హెచ్చరించింది. పందుల్లో ఉండే ‘క్యాట్ క్యూ వైరస్' (సీక్యూవీ) (Cat Que Virus) దోమల ద్వారా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నదని సోమవారం హెచ్చరించింది. ఈ వైరస్ క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఐసీఎంఆర్ (,Indian Council of Medical Research (ICMR) , పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి దేశవ్యాప్తంగా 883 సీరమ్ నమూనాలు సేకరించగా అందులో ఇద్దరిలో సీక్యూవీ వైరస్‌ను ఎదిరించే యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. కర్ణాటకకు చెందిన ఈ ఇద్దరికి సీక్యూవీ సోకి తగ్గిపోయినట్టు నిర్ధారించారు. దీనితో మరి కొంతమంది శాంపిల్స్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాధి పందులు, క్యూలెక్స్ దోమల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మలేరియా, డెంగీ, హంటా వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా సీక్యూవీ వైరస్‌ను గుర్తించే టెస్టును అభివృద్ధి చేశారు. చైనా, వియత్నాంలలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది.
ఇప్పటికే డ్రాగన్ కంట్రీ (China), వియత్నాంలోని అనేకమందికి సోకిన ‘క్యాట్ క్యూ వైరస్'(CQV) భారత్‌లో మెనింజైటిస్, పీడియాట్రిక్ ఎన్సెఫలైటిస్ వంటి వ్యాధులకు కారణమవుతుందని తెలిపింది. మన దేశంలో పందులు క్యాట్ క్యూ వైర్‌సకు ప్రాథమిక వాహకాలుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు ఏజిప్టీ, క్యూలెక్స్ క్విన్‌క్వేఫాషియేటస్, క్యూలెక్స్ ట్రైటేనియోరైన్‌కస్ జాతుల దోమల ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించొచ్చని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో మనుషులతో పాటు పందులు, ఇతర జంతువుల శాంపిళ్లనూ సేకరిస్తామన్నారు. కాగా, దోమలను ఆవాసాలుగా మా ర్చుకొని సంఖ్యను పెంచుకునే సామర్థ్యం క్యాట్ క్యూ వైర్‌స కు ఉండటం ఆందోళనకర అంశమని ఐసీఎంఆర్ పేర్కొంది. ఈ కొత్త వైరస్ వల్ల ఫెబ్రైల్ ఆరోగ్య సమస్యలు(మలేరియా, డెంగీ, హంటావైర్‌సతో తలెత్తే రుగ్మతలు), మెనింజైటిస్, పిడియాట్రిక్ ఎన్‌సెఫలైటిస్ ప్రబలొచ్చని తెలిపింది.