Indian Nationals Stranded Abroad: విదేశాల్లో భారతీయులు విలవిల, మే 7 నుంచి దశల వారీగా విమానాలు,నౌకల ద్వారా స్వదేశానికి తరలింపు, 14 రోజులపాటు పేమెంట్‌ ప్రాతిపదికన క్వారంటైన్‌లోకి..
Flight Operations | File Image | (Photo Credits: IANS)

New Delhi, May 5: కోవిడ్‌-19 లాక్‌డౌన్‌లతో (Covid-19 Lockdown) విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను (Indian Nationals Stranded Abroad) మే 7 నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఏర్పాట్లు చేస్తోంది. వీరందరినీ దశలవారీగా విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి రప్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం నిర్థిష్ట విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలు దేశానికి తిరిగివచ్చే భారత పౌరుల జాబితాలను సిద్ధం చేస్తాయి. అయితే స్వదేశానికి వచ్చేందుకు అయ్యే చార్జీలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది. విదేశాల్లోని భారతీయుల కోసం బయలు దేరిన మూడు యుద్ధ నౌకలు, యుఎఈ, మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలింపు, వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ

వైరస్‌ (Coronavirus) లక్షణాలు లేనివారిని మాత్రమే స్వదేశానికి వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఇక్కడకు చేరుకున్న తర్వాత మరోసారి వారికి స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని, అనంతరం 14 రోజులపాటు పేమెంట్‌ ప్రాతిపదికన క్వారంటైన్‌లో ఉంచుతామని తెలిపింది. గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత వారందరూ ఆరోగ్య సేతు యాప్‌లో తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. భారత్‌కు చేరుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి రెండు వారాలు క్వారంటైన్‌లో ఉంచిన అనంతరం మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపడతారు.

ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారి కోసం టెస్టింగ్‌, క్వారంటైన్‌, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలపై భారత్‌ మార్చి 23న నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రవాస భారతీయుల్లో దాదాపు 70 శాతం మంది నివసిస్తున్న గల్ఫ్‌ దేశాలతో ఈ తరలింపు ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడుతలో సుమారు 19 లక్షల మందిని స్వదేశానికి తీసుకురానున్నట్లు చెప్పారు. మొదట యూఏఈ, అనంతరం సౌదీ అరేబియా, కువైట్‌ నుంచి భారతీయులను తరలించనున్నట్లు పేర్కొన్నారు.  67 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా, ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్‌ కార్యాలయం మూసివేత, క్వారంటైన్‌లోకి 50 మంది భద్రతా సిబ్బంది

గత వారం, గల్ఫ్‌లోని భారత మిషన్లు తిరిగి రావడానికి మరియు వారు ఉద్దేశించిన తుది గమ్యానికి సంబంధించిన వివరాలను అందించడానికి తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలని భారతీయ పౌరులను కోరుతూ ఒక ప్రశ్నాపత్రం జారీ చేశారు. ఒక్క సోమవారం రాత్రి వరకు యుఎఇలో రెండు లక్షల మంది పౌరులను రాయబార కార్యాలయం నమోదు చేసింది. ఈ దశలో, ఈ ప్రాంతంలోని ఆరు దేశాల నుండి భారతీయులను తిరిగి తీసుకురావాలని భారత్ యోచిస్తోంది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, మలేషియా మరియు ఇరాన్‌ల నుంచి ముందుగా తీసుకురావడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత మిగతా దేశాల నుంచి తీసుకురానున్నారు.   24 గంటల్లో 195 మంది మృతి, దేశంలో 46 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, దడపుట్టిస్తున్న మహారాష్ట్ర, ముంబైలో మే 17 వరకు 144 సెక్షన్

ఇదిలా ఉంటే సింగపూర్‌లో ఏప్రిల్‌ చివరినాటికి 4800 మంది భారతీయులు కొవిడ్‌-19 బారిన పడ్డారని అక్కడి భారత హైకమిషనర్‌ జావేద్‌ అష్రఫ్‌ తెలిపారు. వారిలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. బాధితుల్లో 90శాతం మంది వసతి గృహాల్లో నివాసం ఉంటున్న కార్మికులేనని సోమవారం ఆయన పేర్కొన్నారు. సింగపూర్‌లో ఆదివారం నాటికి 18,205 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 18 మంది మరణించారు. దేశంలో వ్యాధి క్రమంగా విస్తరిస్తుండటంతో సింగపూర్‌లో ఉన్న భారత విద్యార్థులు, కార్మికులు సొంతదేశం వెళ్లిపోవాలని భావిస్తున్నారని అష్రఫ్‌ వెల్లడించారు.

భారత్‌కు వచ్చేందుకు 3500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, అందుకు వీలుకాకపోతే తమకు వసతి కల్పించాలని కోరుతున్నారని తెలిపారు. వర్క్‌ పర్మిట్‌పై సింగపూర్‌లో ఉంటున్నవారిలో ఎక్కువమంది కంపెనీలు ఏర్పాటుచేసిన వసతిగృహాల్లోనే ఉంటున్నారు. దేశంలో నమోదైన కొవిడ్‌ -19 కేసుల్లో అలాంటి వసతి గృహాల్లోనివారే 90శాతం మంది ఉన్నారు. ఈ వసతిగృహాల్లో కరోనా కేసులు పెరుగుతుండగా ఇతర ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టాయి.