COVID-19 Pandemic: 24 గంటల్లో 195 మంది మృతి, దేశంలో 46 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, దడపుట్టిస్తున్న మహారాష్ట్ర, ముంబైలో మే 17 వరకు 144 సెక్షన్
Coronavirus Outbreak in Italy. (Photo Credits: AFP)

New Delhi, may 5: ఇండియాలో కరోనా మహమ్మారి (2020 Coronavirus Pandemic in India) తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,900 కేసులు నమోదయ్యాయి. అలాగే 195 మరణాలు సంభవించాయి. భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 46,433 కు చేరుకుందని, ఇప్పటివరకు 1,568 మంది (Coronavirus deaths in india) మరణించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల భారీన పడిన వారి సంఖ్య 3,645,342గా ఉంది. ఏపీ రాష్ట్రంలో 1650కి చేరిన కరోనావైరస్ కేసులు, 524 మంది కోలుకుని డిశ్చార్జ్, 33 మంది మృతి, తాజాగా 67 కేసులు నమోదు

ముంబై న‌గ‌రంలో సోమ‌వారం ఒక్క రోజే కొత్త‌గా 510 పాజిటివ్ కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. మొత్తం 18 మంది మృతి చెందారు. ఈ కేసుల‌తో ముంబైలో (Mumbai) క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9123కు చేరుకుంది. ముంబైలో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు పోలీసులు 144 (క్రిమిన‌ల్ పీన‌ల్‌కోడ్‌)సెక్ష‌న్ ను విధించారు. మే 17 వ‌ర‌కు 144 సెక్ష‌న్ అమ‌లులో ఉంటుంది.

Here's India Covid-19 Report

అత్య‌వ‌స‌రం కాకున్నా ఒక‌రు లేదా అంత‌కంటే ఎక్కువ మంది రోడ్డుపైకి వస్తే కేసు పెట్టి..అరెస్ట్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని ముంబై పోలీస్ ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. వైద్య‌సేవ‌లు మిన‌హా ఇత‌ర ప‌నుల కోసం బ‌య‌ట‌కు రావ‌డంపై ప్ర‌తీ రోజూ ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు లాక్ డౌన్ నిబంధ‌న‌లు, నిషేధాజ్ఞ‌లు అమ‌లులో ఉంటాయ‌ని వెల్ల‌డించారు. తమిళనాడులో కరోనా కల్లోలం, ఒక్కరోజే 527 కేసులు నమోదు, గ్రీన్ జోన్లలో కేసులు పెరిగితే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని స్పష్టం చేసిన లవ్‌ అగర్వాల్‌

దేశంలో న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల్లో (Coronavirus Cases in India) అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలోనే (Maharashtra) వెలుగుచూస్తున్నాయి.ముఖ్యంగా పోలీస్ శాఖ‌లో కేసుల తీవ్ర‌త పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంది. తాజాగా జెజె మార్గ్ పోలిస్ స్టేష‌న్‌కు చెందిన 12 మంది పోలీసులకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. వీరిలో ఆరుగురు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయితే వీరిలో 8 మందిలో క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌లేవ‌ని, ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలిపారు. దీంతో వీరి కుటుంబ‌ స‌భ్యులు స‌హా, 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపిన‌ట్లు అసిస్టెంట్ పోలీస్ క‌మిష‌న‌ర్ అవినాష్ ధ‌ర్మాధికారి తెలిపారు. ఒకరోజు లేస్తున్నాయ్, మరోరోజు పడుతున్నాయి! తెలంగాణలో కొత్తగా 03 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు, రాష్ట్రంలో 1085కు చేరిన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య, ఈరోజు భేటీ అవుతున్న రాష్ట్ర కేబినేట్

ఆదివారం ఒక్క‌రోజే పైథోని పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఆరుగురికి, నాగ్‌పాడాకు చెందిన ముగ్గురు, మ‌హిమ్ పోలిస్ స్టేష‌న్‌లోని ఇద్ద‌రు పోలీసులు కోవిడ్ భారిన ప‌డిన‌ట్లు సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా ఇప్పటివరకు 46 వేల‌కు పైగానే క‌రోనా కేసులు న‌మోదుకాగా, ఒక్క మ‌హారాష్ట్రలోనే అత్య‌ధికంగా 12,974 కేసులు న‌మోదయ్యాయి. 548 మంది మ‌ర‌ణించారు.

S. No. Name of State / UT Total Confirmed cases (Including 111 foreign Nationals) Cured/Discharged/ Migrated Deaths ( more than 70% cases due to comorbidities )
1 Andaman and Nicobar Islands 33 32 0
2 Andhra Pradesh 1650 524 36
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 43 32 1
5 Bihar 528 130 4
6 Chandigarh 102 21 1
7 Chhattisgarh 58 36 0
8 Delhi 4898 1431 64
9 Goa 7 7 0
10 Gujarat 5804 1195 319
11 Haryana 517 254 6
12 Himachal Pradesh 41 34 1
13 Jammu and Kashmir 726 303 8
14 Jharkhand 115 27 3
15 Karnataka 651 321 27
16 Kerala 500 462 4
17 Ladakh 41 17 0
18 Madhya Pradesh 2942 798 165
19 Maharashtra 14541 2465 583
20 Manipur 2 2 0
21 Meghalaya 12 0 1
22 Mizoram 1 0 0
23 Odisha 169 60 1
24 Puducherry 8 5 0
25 Punjab 1233 121 23
26 Rajasthan 3061 1394 77
27 Tamil Nadu 3550 1409 31
28 Telengana 1085 585 29
29 Tripura 29 2 0
30 Uttarakhand 60 39 1
31 Uttar Pradesh 2766 802 50
32 West Bengal 1259 218 133
Total number of confirmed cases in India 46433* 12727 1568

ఢిల్లీలో కొత్త‌గా 934 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే వరుసగా రెండవ రోజు మరణాలు చోటుచేసుకోలేదు. ఆదివారం రాత్రి నాటికి కోవిడ్‌-19 కేసుల సంఖ్య 4,549. వీరిలో 64 మంది మృతిచెందారు. ఇప్పటివరకు చోటుచేసుకున్న‌ 64 మరణాల్లో 60, అంతకంటే ఎక్కువ వయస్సు గ‌ల‌వారు 51 శాతం మంది ఉన్నారు. ఢిల్లీ‌లో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇంత‌కు ముందు ఢిల్లీ ప్రభుత్వం 100 ప్రదేశాలకు సీలు వేసింది. అయితే ప‌రిస్థితులు మెరుగుప‌డుతున్న దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో నిబంధ‌న‌లు స‌డ‌లిస్తున్నారు. మూడు హాట్‌స్పాట్ జోన్‌లను సైతం తెరిచారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో కంటైనర్ జోన్ల సంఖ్య 90గా ఉంది.