Coronavirus Outbreak | Representational Image| (Photo Credits: IANS)

Chennai, May 5: తమిళనాడులో కరోనావైరస్ (Tamil Nadu COVID-19) వేగంగా విస్తరిస్తున్నది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య అక్కడ పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 527 మందికి కరోనా మహమ్మారి సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,550కి చేరిందని తమిళనాడు ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. ఏపీ‌కి క్యూ కట్టిన తమిళనాడు, తెలంగాణ మందుబాబులు, అధికారులకు తెలియడంతో అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత, దేశ వ్యాప్తంగా భారీగా క్యూ లైన్లు

మొత్తం కేసుల్లో 1,409 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 31 మంది మరణించారని మిగతా 2,108 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో 12 ఏళ్ల వయసు లోపు 121 మంది పిల్లలకు కొవిడ్-19 సోకిన విషయం విదితమే.

ఇక దేశంలో కరోనా (Coronavirus) విజృంభిస్తోంది. ప్రతి రోజూ వేల కేసులు నమోదవుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దాదాపు 2,500 పైగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 2,573 పాజిటివ్ కేసులు (Coronavirus Cases in India) నమోదయ్యాయి. 83 మంది మరణించారు. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 42,836కు పెరిగింది. 1,389 మంది మరనించారు. 11,792 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 29,685 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 27.45 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు

ఇదిలా ఉంటే గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌కు (Lockdown) సడలింపులు అమల్లోకి వచ్చిన తొలిరోజే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా పాజిటివ్‌ కొత్త కేసులు వేగంగా ప్రబలితే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని స్పష్టం చేసింది. రెడ్‌జోన్లు, కంటైన్మెంట్‌ జోన్లలో ఎలాంటి సడలింపులూ ఉండవని పేర్కొంది.రాష్ట్రాల మధ్య రాకపోకలను అప్పుడే అనుమతించబోమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.   అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు

రెడ్‌ జోన్లలో రిక్షాలు, ఆటోలు, ట్యాక్సీలు నిషేధమని, స్కూళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌, సెలూన్లు, స్పాలను అనుమతించమని స్పష్టం చేశారు. అన్ని మతాల ప్రార్ధనా స్థలాలను ప్రారంభించరాదని, చిరు వ్యాపారులు ఒకరు నిర్వహించే దుకాణాలను తెరుచుకోవచ్చని చెప్పారు. కంటైన్మెంట్‌ జోన్లలో కఠిన నియంత్రణలు అవసరమని చెప్పారు. ఇక వలస కూలీల తరలింపునకు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక రైళ్లు నడిపారని, వలస కూలీల నుంచి చార్జీలు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. కార్మికుల తరలింపునకు అయిన వ్యయంలో 85 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు.