Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, May 4: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు (Andhra pradesh covid 19 pandemic) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,292 శాంపిల్స్‌ను పరీక్షించగా 67 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. ఏపీ‌కి క్యూ కట్టిన తమిళనాడు, తెలంగాణ మందుబాబులు, అధికారులకు తెలియడంతో అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత, దేశ వ్యాప్తంగా భారీగా క్యూ లైన్లు

ఇప్పటివరకు రాష్ట్రంలో (Andhra pradesh) కరోనా నుంచి 524 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 33 మంది (Coronavirus Deaths) మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1093 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 1, వైఎస్సార్‌ జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 25, విశాఖపట్నం జిల్లాలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలిపితే జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి. కర్నూలు- 491, గుంటూరు- 338, కృష్ణా- 278, నెల్లూరు- 91, చిత్తూరు- 82, కడప- 87, ప్రకాశం- 61, అనంతపురం-78, తూర్పుగోదావరి- 45, విశాఖపట్నం-35, పశ్చిమ గోదావరి-59, శ్రీకాకుళం జిల్లాలో 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో వివరించింది.

Here's AP Corona Report

దేశంలో పది లక్షల జనాభాకు 2 వేలకు పైగా కరోనా వైరస్‌ నిర్ధారిత పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మరో మైలు రాయిని దాటింది. ఇప్పటివరకు ఏపీలో 1,14,937 టెస్టులు నిర్వహించారు. దీంతో ప్రతి పది లక్షల జనాభాకు 2,152 మందికి టెస్టులు చేస్తున్నట్టు తేలింది. ఎక్కువ టెస్టులు చేస్తున్న కారణంగా ఇన్ఫెక్షన్‌ ఉన్న వారిని వేగంగా గుర్తించి ఐసోలేషన్‌కు పంపగలుగుతున్నారు. ఏపీకి ఎంఫాన్ రూపంలో తుపాను గండం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం ఆదేశాలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫెక్షన్‌ రేటు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఏపీలో ఇన్ఫెక్షన్‌ రేటు 1.38గా నమోదైంది. జాతీయ సగటు ఇన్ఫెక్షన్‌ రేటు 3.81గా ఉంది. కరోనా మరణాలు రేటు కూడా గణనీయంగా తగ్గింది. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో మరణాల రేటు 2.08గా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా 10,46,450 టెస్టులు నిర్వహించారు. ఈ గణాంకాల ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 754 మందికి కరోనా నిర్థారిత టెస్టులు చేస్తున్నగా వెల్లడవుతోంది.