Amaravati, May 4: ఇప్పటికే కరోనా వైరస్ (Coronavirus) కోరల్లో చిక్కుకుని పోయిన ఏపీకి (Andhra pradesh) మరో గండం పొంచివుంది. బంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణదిశగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారబోతోందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్‌కు ఎంఫాన్‌గా (Amphan Cyclone) నామకరణం చేశారు. ఏపీలో మూడవ దశ లాక్‌డౌన్, గ్రీన్ జోన్లలో 25 శాతం పెంపుతో మద్యం అమ్మకాలు, కంటైన్‌మెంట్ క్లస్టర్ల ప్రాతిపదికగా సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 72 గంటల్లో అది వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండంగా మారిన తరువాత అది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) అంచనా ప్రకారం..ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రభావం వల్ల ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు
ఆ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిసా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.
ఎంఫాన్' తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తే సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వైపు భారీ తుపాను వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 'విద్యుత్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలి. ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి. 2020లోనే ఆరు ప్రాజెక్టులు ప్రారంభం, పోలవరం సమీక్ష సంధర్భంగా ఏపీ సీఎంకు తెలిపిన అధికారులు, పనులు వేగవంతం చేయాలన్న వైయస్ జగన్
బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. తుపాను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి. వర్షాలతో దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలి. కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంత వరకు కొనుగోలు చేయాలని' జగన్ అధికారులను ఆదేశించారు.
తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. ఎంఫాన్ తుఫాన్ సంకేతాలు అందిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావం వల్ల వచ్చే 72 గంటల సమయంలో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కెరటాలు సాధారణ రోజుల కంటే ఎక్కువ ఎత్తు వరకు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాటిని అకాల వర్షాలుగానే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు.