Car Attack: జర్మనీలో ఘోరం.. క్రిస్మస్ మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు (వీడియో)
రద్దీగా ఉన్న వారిమీదకు దూసుకెళ్లింది.
Newdelhi, Dec 21: జర్మనీలో ఘోరం జరిగింది. మాగ్డేబర్గ్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్‌లో (Christmas market) ఓ కారు (Car) బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న వారిమీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఇద్దరు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఓ డాక్టర్ నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఇది జరిగిందని, ప్రమాదానికి కారణమైన డాక్టర్‌ను (50) అదుపులోకి తీసుకున్నామని, అతడు సౌదీ అరేబియాకు చెందిన వాడని అధికారులు తెలిపారు.
Here's Video:
ఉద్దేశపూర్వకంగానే..
నిందితుడు రెంట్ కు తీసుకున్న కారుతో ఉద్దేశపూర్వకంగానే మార్కెట్‌లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తున్నది. అయితే, ఎందుకు ఇలా చేశాడో విచారణలో తెలియాల్సి ఉంది. కాగా ప్రమాదానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.