IPL Auction 2025 Live

Eiffel Tower: ఫుల్లుగా తాగి ఈఫిల్‌ టవర్‌ మీదనే రాత్రంతా పడుకున్న వ్యక్తులు, నిషేదిత ప్రాంతంలోకి వెళ్లి హాయిగా కునుకుతీసిన మందుబాబులపై కేసు నమోదు

తాగిన మైకంలో అత్యంత ఎత్తులో ఉన్న, పర్యాటకులకు అనుమతిలేని ప్రదేశానికి వారు చేరుకున్నారు. టవర్‌ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులు అందరినీ కిందకు దించినప్పటికీ నిషిద్ధ ప్రాంతంలోకి వెళ్లిన ఆ ఇద్దరిని గమనించలేదు.

Eiffel Tower (PIC@Pexels)

Paris, AUG 16: అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు పూటుగా మద్యం సేవించి (Drunken American Tourists) ఆగస్టు 13న రాత్రి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌పైకి (Eiffel Tower) ఎక్కారు. తాగిన మైకంలో అత్యంత ఎత్తులో ఉన్న, పర్యాటకులకు అనుమతిలేని ప్రదేశానికి వారు చేరుకున్నారు. టవర్‌ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులు అందరినీ కిందకు దించినప్పటికీ నిషిద్ధ ప్రాంతంలోకి వెళ్లిన ఆ ఇద్దరిని గమనించలేదు. దాంతో ఆ ఇద్దరు అమెరికన్‌ టూరిస్టులు రాత్రంతా ఈఫిల్‌ టవర్‌పైనే (Eiffel Tower) పడుకున్నారు.

Arrest Warrant on Donald Trump: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు అరెస్ట్ వారెంట్ జారీ.. 2020 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రిగిన అల్ల‌ర్ల కేసుల్లో వారెంట్ 

మరుసటి రోజు ఉదయం 9.00 గంటలకు టవర్‌ తెరిచేముందు భద్రతా సిబ్బంది గస్తీ తిరుగుతుండగా పైన నిషేధిత ప్రాంతంలో ఆ టూరిస్టులిద్దరూ పడుకుని ఉండటం గమనించారు. దాంతో షాకైన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఫైర్‌పైటర్లు, రెస్క్యూ సిబ్బందిని రప్పించి వారిని సురక్షితంగా కిందికి దించారు. అనంతరం పారిస్ పోలీసులు ఆ ఇద్దరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Eiffel Tower: ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు, సందర్శకులను ఖాళీ చేయించిన పోలీసులు, పరిసరాల్లో ఆంక్షలు విధింపు 

కాగా, ఈ ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ నిర్మాణాన్ని 1887లో మొదలుపెట్టి 1889 మార్చి 31న పూర్తిచేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ప్రపంచ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈ ఈఫిల్‌ టవర్‌ను సందర్శిస్తున్నారు. 2022 సంవత్సరంలో 62 లక్షల మందికి పైగా పర్యాటకులు ఈఫిల్‌ టవర్‌ను సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు.



సంబంధిత వార్తలు