UK Man Chops Wife: భార్య‌ను హ‌త్య చేసి 224 ముక్క‌లుగా కోసిన కిరాత‌కుడు, ప్టాస్టిక్ బ్యాగులో పెట్టి న‌దిలో ప‌డేసిన వ్యక్తి

లోపలంతా పరిశీలించారు. బాత్‌ రూమ్‌లోని టబ్‌లో రక్తం మరకలున్న బెట్‌ షీట్లు, బెడ్‌ రూమ్‌ నేలపై పెద్ద మరకలు, కిచెన్‌లో రంపాన్ని చూశారు. అలాగే రసాయనాల వాసనలు గమనించి నికోలస్‌ను ఆరా తీశారు.

Knife (Representational Image; Photo Credit: Pixbay)

Paris, April 07: ఒక వ్యక్తి తన భార్యను (Wife Murder) దారుణంగా చంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 224 ముక్కలుగా నరికాడు. (UK Man chops wife’s body into 224 pieces) ప్లాస్టిక్‌ బ్యాగుల్లో కొన్ని రోజులు దాచాడు. ఆ తర్వాత స్నేహితుడికి డబ్బులు ఇచ్చి వాటిని నదిలో పడేశాడు. ఆ నరరూప రాక్షకుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్రిటన్‌లోని లింకన్ నగరంలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల నికోలస్ మెట్సన్‌, 26 ఏళ్ల హోలీ బ్రామ్లీకి 2021లో వివాహం జరిగింది. అయితే పెళ్లైన 16 నెలలకే ఆ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా, 2023 మార్చి 17న ఇంటికి తిరిగి వచ్చిన బ్రామ్మీ ఆ తర్వాత కనిపించలేదు. ఆందోళన చెందిన ఆమె తల్లి, సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మార్చి 24న నికోలస్ అపార్ట్‌మెంట్‌కు పోలీసులు చేరుకున్నారు. తలుపు తెరిచిన అతడ్ని భార్య గురించి అడిగారు. అయితే ఆమె తనపట్ల గృహ హింసకు పాల్పడిందని, తన చేతిని కొరికిందని ఆరోపించారు. మార్చి 19న స్థానిక మానసిక ఆరోగ్య బృందంతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు.

Bird Flu Pandemic: కోవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదకరంగా బర్డ్ ఫ్లూ మహమ్మారి, కరోనా వైరస్ వ్యాప్తి కన్నా ఘోరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిక 

మరోవైపు పోలీసులు ఆ మరునాడు తిరిగి ఆ ఇంటికి వెళ్లారు. లోపలంతా పరిశీలించారు. బాత్‌ రూమ్‌లోని టబ్‌లో రక్తం మరకలున్న బెట్‌ షీట్లు, బెడ్‌ రూమ్‌ నేలపై పెద్ద మరకలు, కిచెన్‌లో రంపాన్ని చూశారు. అలాగే రసాయనాల వాసనలు గమనించి నికోలస్‌ను ఆరా తీశారు. బెడ్‌ కింద దాక్కున్న తన భార్య రూమ్‌ క్లీన్‌ చేసి ఉంటుందని అతడు జోక్‌ చేశాడు. దీంతో భార్యను హత్య చేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. 2023 మార్చి 25న నదిలో తేలుతున్న ప్లాస్టిక్‌ బ్యాగులను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించగా 224 ముక్కలుగా నరికిన మానవ శరీర భాగాలు వాటిలో ఉన్నాయి. అవి బ్రామ్లీ శరీర భాగాలుగా గుర్తించారు. పలుమార్లు కత్తిలో పొడిచి భార్యను చంపిన నికోలస్‌, మృతదేహాన్ని 224 ముక్కలుగా నరికినట్లు నిర్ధారించారు.

అయితే మార్చి 25న అరెస్ట్‌కు ముందు నికోలస్‌ ఆ ప్లాస్టిక్‌ బ్యాగులను లిఫ్ట్‌ ద్వారా అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు తరలించినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. భార్య ఖాతా నుంచి డ్రా చేసిన 50 డాలర్లు స్నేహితుడైన 28 ఏళ్ల జాషువా హాన్‌కాక్‌కు ఇచ్చి అతడి సహాయంతో వాటిని కాలువలో పడేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. నికోలస్‌, అతడికి సహకరించిన స్నేహితుడ్ని దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి శిక్షలు ఖరారు చేయనున్నది.